Thursday, July 23, 2020

🌹. సౌందర్య లహరి - 51 / Soundarya Lahari - 51 🌹


*🌹. సౌందర్య లహరి - 51 / Soundarya Lahari - 51 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

51 వ శ్లోకము 

*🌴. దేవీ అనుగ్రహం - పలుకుబడి, కీర్తి ప్రతిష్ఠలు 🌴*

శ్లో: 51. శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా 
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీl 
హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ
సఖీషుస్మేరా తేమయి జనని దృష్టిః సకరుణాll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా ! నీ చూపు పరమ శివుని యందు శృంగార రసముతో తడుపబడి, ఆయనకు ప్రేమ కలదిగా యుండెను.ఇతరుల దృష్టి వికారము యందు ఏవగింపు కలదియు, సవతి అయిన గంగా దేవి యందు రోషముతో కూడి ఉన్నది. మన్మధుని దగ్ధము చేసిన ఫాల నేత్రమున ఆశ్చర్యము కలదియు,ఆయన ఆభరణములు అయిన పాముల యందు భయము కలదియు,ఎర్రని కలువల యందు సొందర్య రసము కలిగి ఉన్నది.చెలికత్తెల యందు చిరు నవ్వు కలిగి హాస్యముగా ఉన్నది. నిన్ను స్తుతి చేయు నా వంటి భక్తుల యందు కరుణ రసము కలిగి ఉన్నది . కదా ! 
  
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె, తీపి మినప గారెలు నివేదించినచో దేవీ అనుగ్రహం, పలుకుబడి అభివృద్ధి, కీర్తి ప్రతిష్ఠలు లభ్యమగును అని చెప్పబడింది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 SOUNDARYA LAHARI - 51 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 51 

*🌴 Obtaining Devi's grace and achieving high influence 🌴*

51. Shive sringarardhra tad-ithara-jane kutsana-paraa Sarosha Gangayam Girisa-charite'vismayavathi; Har'ahibhyo bhita sarasi-ruha-saubhagya-janani Sakhishu smera the mayi janani dristih sakaruna 
 
🌻 Translation : 
 Mother of all universe, the look from your eyes, is kind and filled with love, when looking at your lord, is filled with hatred at all other men, is filled with anger when looking at ganga, the other wife of your lord, is filled with wonder, when hearing the stories of your lord, is filled with fear, when seeing the snakes worn by your lord, is filled with red color of valor of the pretty lotus fine, is filled with jollity, when seeing your friends, and filled with mercy, when seeing me.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 45 days, offering honey and vada (urad dhal)as prasadam, it is believed that they will be able obtaining Devi's grace and achieving high influence
 
🌻. BENEFICIAL RESULTS: 
Enticing people, obtaining Devi's grace and achieving high influence.
 
🌻 Literal Results: 
The rasas involved in this sloka (fear, disgust, dislike, anger, love, heroism, compassion and wonder) are one less than the navarasas; full of potency to rejuvenate the life
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment

𝐏𝐎𝐖𝐄𝐑 𝐎𝐅 𝐄𝐀𝐂𝐇 𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀 𝐋𝐀𝐇𝐀𝐑𝐈 𝐒𝐇𝐋𝐎𝐊𝐀 - 00

🌹.   𝐏𝐎𝐖𝐄𝐑  𝐎𝐅  𝐄𝐀𝐂𝐇  𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀  𝐋𝐀𝐇𝐀𝐑𝐈  𝐒𝐇𝐋𝐎𝐊𝐀   🌹 📚.  Prasad Bharadwaj 1. Winning in every field 2. Att...