*🌹. సౌందర్య లహరి - 59 / Soundarya Lahari - 59 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
66 వ శ్లోకము
🌴. సంగీత వాయిద్యాల యందు ప్రావీణ్యత, గాత్ర మధురిమకు, రోగముల నివారణకు 🌴
శ్లో: 66. విషఞ్చ్యా గాయన్తీ వివిధమపదానం పశుపతే స్త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే
త్వదీయైర్మాధుర్యైరపలపిత తన్త్రీకలరవాం నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతమ్ ll
🌻. తాత్పర్యం :
అమ్మా! సరస్వతీదేవి నీ ఎదుట పరమ శివుని విజయగాధలు వీణతో పాడుచు ఉండగా, అప్పుడు నీవు నీ మనస్సునందు కలిగిన సంతోషమును తెలుపుచూ శిరస్సును కదుపుతూ ప్రశంసా వాక్యములు పలుకుట మొదలు పెట్టగానే, ఆ వాక్యములందలి మాధుర్యము నకు, తన యొక్క వీణా తంత్రము కలవరము చెందినదయి తన యొక్క వీణను చీర చెంగుతో కప్పివేసెను .కదా !
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె, క్షీరాన్నము నివేదించినచో సంగీత వాయిద్యాల యందు ప్రావీణ్యత, గాత్రము యందు మధురిమ, రోగముల నివారణ లభించును అని చెప్పబడింది.
🌹 SOUNDARYA LAHARI - 66 🌹
📚 Prasad Bharadwaj
Sloka - 66 🌹
🌴 Sweet Words and Mastery in Music 🌴
66. Vipanchya gayanthi vividham apadhanam Pasupathea Thvay'arabdhe vakthum chalita-sirasa sadhuvachane; Tadhiyair madhuryair apalapitha-tantri-kala-ravam Nijaam vinam vani nichulayati cholena nibhrutham.
🌻 Translation :
Oh mother of all, when you start nodding your head, muttering sweetly, good, good, to the goddess Saraswathi,when she sings the great stories to you, of Pasupathi our lord, with the accompaniment of her veena,she mutes the veena by the covering cloth, so that the strings throwing sweetest music, are not put to shame, by your voice full of sweetness.
🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 45 days, offering as milk payasam, honey as prasadam, it is believed that they will be achieve mastery in music and musical instruments and free from diseases
🌻 BENEFICIAL RESULTS:
Cure of minor ailments, gets skill in vocal and instrumental music.
🌻 Literal Results:
The last two verses "Thadeeyairmaadhuryai.....Nibhrutham" are not suitable for veena aspirants. Excellent sloka for vocalists. Also induces sweet speech.
🌹 🌹 🌹 🌹 🌹
🌴 పెద్ద వారి దయ సంపాదించుటకు, అందరిలో అమ్మని దర్శించుట, సకల కార్య విజయము 🌴
శ్లో:67. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం ముహు రధరపానాకులతయా
కరగ్రాహ్యం శమ్భోర్ముఖ ముకురవృన్తం గిరిసుతే కథంకారం బ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితమ్ ll
🌻. తాత్పర్యం :
అమ్మా ! పర్వత రాజ కుమారీ ! నీ తండ్రి గారిచే గారాబముగా చేతి కొసలచే తడుప బడినదియు, మరియు పతి అయిన శివుని చేత పానకమాడు వేళ తడబడి మాటి మాటికి పైకి ఎత్తబడి శివుని చేత పట్టుకొనబడి ముఖము అనెడు అద్దమునకు పిడి అని నీ చుబుకమును వర్ణించ తరము కాదు కదా.
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పాయసం, తాంబూలము నివేదించినచో గొప్ప గొప్ప వారి, ఉన్నతోద్యోగుల సహాయము లభంచునని, స్నేహ పూర్వకముగా ఉండగలరు అని చెప్పబడింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SOUNDARYA LAHARI - 67 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 67
🌴 Friendliness of higher officials and Appearance in Person of the Goddess 🌴
67. Karagrena sprustam thuhina-girina vatsalathaya Girisen'odasthama muhur adhara-pan'akulataya; Kara-grahyam sambhor mukha-mukura-vrintham Giri-sute Kadham-karam bramas thava chubukam aupamya-rahitham.
🌻 Translation :
Oh daughter of the mountain, how can we describe the beauty of your chin, which was with affection caressed, by the tip of his fingers by your father himavan, which was oft lifted by the lord of the mountain, Shiva, in a hurry to drink deeply from your lips; which was so fit to be touched by his fingers; which did not have anything comparable, and which is the handle of the mirror of your face.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 45 days, offering paysam and thambulam as prasadam, they will get an opportunity to see the lord in person, achieve success in all respects, get help from higher officials.
🌻 BENEFICIAL RESULTS:
Royal and governmental favours, power to visualise Devi, suuccess of plans.
🌻 Literal Results:
Loved by all, rejuvenation.
🌹 🌹 🌹 🌹 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
68 వ శ్లోకము
🌴. రాజు నుండి, అధికారి నుండి అనుకూల సహాయం, ఇతరులను ప్రభావం చేయుటకు 🌴
శ్లో:68. భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కంణ్టకవతీ తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళ శ్రియ మియమ్
స్వత శ్వేతా కాలాగురుబహుళ జమ్బాలమలినా
మృణాళీలాలిత్యం వహతి యదథో హారలతికాll
🌷. తాత్పర్యం :
అమ్మా! త్రిపురాంతకుడయిన ఈశ్వరుని కౌగిలింత వలన నిత్యమూ రోమాంచిత అగు ముఖ కమలము అను పద్మము యొక్క కాడ అందమును ధరించు చున్నది, ఎందువలన అనగా దాని క్రింది భాగమున సహజముగా తెల్లనిదయి నల్లనిదగు విస్తారమయిన బురద చేత మలినమయిన దియునూ తీగవంటి హారము తామర లత యొక్క లాలిత్యము వహించు చున్నది. కదా!
🌷. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పాయసం, తేనె, తాంబూలము నివేదించినచో, గొప్ప రాజు యొక్క, అధికారుల సహాయము లభంచునని, ఇతరుల మీద ప్రభావమును కలిగి ఉండగలరు అని చెప్పబడింది.
ఈ శ్లోకము గురువు యొక్క ప్రత్యక్ష మార్గదర్శనం యందు చేయవలసిందిగా ప్రత్యేకముగా చెప్పబడింది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SOUNDARYA LAHARI - 68 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 68
🌴 Favours of kings and government, influence on others 🌴
68. Bhujasleshan nithyam Pura-damayituh kantaka-vathi Tava griva dhatte mukha-kamalanaala-sriyam iyam; Svatah swetha kaalaagaru-bahula-jambala-malina Mrinali-lalithyam vahati yadadho hara-lathika.
🌻 Translation :
Your neck appears full of thorns always, due to the hairs standing out, by the frequent embrace of thy lord, who destroyed the three cities. and looks like the beauty of the stalk, of your lotus like face. the chain of white pearls worn below, is dulled by the incense and myrrh, and the paste of sandal applied there, and is like the tender stalk, dirtied by the bed of mud.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 45 days, offering paysam, honey and thambulam as prasadam, they will get Favours of kings and government, influence on others.
Note :
This Sloka should be chanted only after being properly guided by a Guru.
🌻 BENEFICIAL RESULTS:
Favours of kings and government, influence on others.
🌻 Literal Results:
Charm and magnetic attraction, followed by masses.
🌹 🌹 🌹 🌹 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
69 వ శ్లోకము
🌴. సంగీతములో ప్రావీణ్యం, కార్యములలో జయం పొందుటకు 🌴
శ్లో:69. గళే రేఖాస్తిస్రో గతిగమక గీతైకనిపుణే
వివాహవ్యానద్ధ ప్రగుణగుణసంజ్ఖ్యా ప్రతిభువఃl
విరాజన్తే నానావిధమధుర రాగాకరభువాం
త్రయాణాం గ్రామాణాం స్థితినియమసీమాన ఇవతే ll
🌷. తాత్పర్యం :
అమ్మా! సంగీత గతికి సంబంధించిన మార్గదేశి గతులను పాడుట యందు నిపుణరాలవు అగు తల్లీ ! నీ గళమున ముడుతలు లాగున ఉన్న మూడు భాగ్య రేఖలు వివాహ సమయమున మంగళ సూత్రము కట్టిన తరువాత వాని వద్ద పెక్కు పేటలు కలిపి పేనిన మూడు సూత్రములను జ్ఞప్తికి తెచ్చుచూ అనేక విధములయిన రాగములకు నిలయమయిన షడ్జమం, మధ్యమం, గాంధారమనే గ్రామముల ఉనికి కొఱకు ఏర్పాటు చేసిన సరి హద్దులా ప్రకాశించు చున్నది కదా!
🌷. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పాయసం, తేనె, కొబ్బరి కాయ, తాంబూలము నివేదించినచో, సంగీతములో ప్రావీణ్యతను పొందగలరని, కార్యములలో ప్రయత్నం సఫలీకృతం అవగలదు అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹Soundarya Lahari - 69 🌹
📚 Prasad Bharadwaj
SLOKA - 69
🌴 Mastery over Music and success in all works 🌴
69. Gale rekhas thisro gathi-gamaka-gith'aika nipune Vivaha-vyanaddha-praguna-guna-samkhya-prahibhuvah; Virajanthe nana-vidha-madhura-ragakara-bhuvam Thrayanam gramanam sthithi-niyama-seemana iva the.
🌻 Translation :
She who is an expert in gathi, gamaka and geetha,the three lucky lines on your neck, perhaps remind one, of the number of the well tied manifold thread, tied during your marriage, and also remind of the place, in your pretty neck, where originates the three musical notes, of shadja, madhyama and gandhara. (the three major parts of karnatic classical music - procedure, undulations and song)
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 45 days, offering thambulam, honey, payasam and coconut as prasadam, it is believed that they will get mastery over music and can achieve success in all efforts.
🌻 BENEFICIAL RESULTS:
Success in all endeavours, in case of women longevity of husbands, skill in music.
🌻 Literal Results:
Excellent sloka for instrumenatal as well as vocal musicians. Command over the three octaves in music, gains expertise in "gamakas" and musical technique. Gains vast musical repertoire. Ideal for performing artisites, capacity to produce magnetic, melodious and celestial music. Accumulation of neck ornaments.
🌹 🌹 🌹 🌹 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
70 వ శ్లోకము
🌴. తలపెట్టిన కార్యములలో జయం పొందుటకు, దైవము పట్ల చేసిన దోషముల నివారణ 🌴
శ్లో: 70. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం
చతుర్భి స్సౌన్దర్యం సరసిజభావః స్సౌతి వదనైఃl
నఖేభ్యస్సన్త్రస్యన్ ప్రథమమథనా దంధకరిపో
శ్చతుర్ణాం శీర్షాణాం సమమభయ హస్తార్పణధియా l
🌷. తాత్పర్యం :
అమ్మా! బ్రహ్మ అంధకాసురినికి విరోధి అయి వానిని వధించిన పరమ శివుడు, తన అయిదవ తలను తన గోళ్ళతో పెరికి వేయుట వలన మిక్కిలి భయపడిన వాడయి తన నాలుగు తలలతో తనకు అభయ హస్తమును ఇమ్మని తామర తూడుల వలె మృదువయిన నీ నాలుగు చేతులనూ ప్రార్ధించు చున్నాడు కదా!
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పులిహోర, తాంబూలము నివేదించినచో కోరిన కార్యములలో విజయం, దైవము పట్ల చేసిన దోషముల నివారణ జరుగును అని చెప్పబడింది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 70 🌹
📚 Prasad Bharadwaj
SLOKA - 70
🌴 Compensation for Mistakes done to God Shiva, victory in life 🌴
70. Mrinali-mridhvinam thava bhuja-lathanam chatasrinam Chaturbhih saundaryam Sarasija-bhavah stauthi vadanaih; Nakhebhyah samtrasyan prathama-madhanadandhaka-ripo Chaturnam sirshanam samam abhaya-hasth'arapana-dhiya.
🌻 Translation :
Brahma, the god born out of lotus, afraid of the nails of Shiva ,who killed the asura called andhaka, which has clipped of one of his heads, praises with his four faces, your four pretty, tender hands, resembling the lotus flower stalk, so that he can ask for protection for his remaining four heads, by use of your four merciful hands at the same time.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 45 days, offering thambulam and yellow rice (Haridhraannam) as prasadam, it is believed that they will be achieve success in all efforts and victory in all walks of life and Compensation for Mistakes done to God Shiva.
🌻 BENEFICIAL RESULTS:
Success in particular endeavour for which meditation is intended, freedom from Shiva-apachaaraa, relief from fear.
🌻 Literal Results:
Great beauty, clarity and wisdom, ideal for instrumentalists, sculptors and dancers.
🌹 🌹 🌹 🌹 🌹
🌹. సౌందర్య లహరి - 71 / Soundarya Lahari - 71 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
71 వ శ్లోకము
🌴. భయాల నుండి విముక్తి, సంపదలు, యక్షిణీ దేవత వశీకరణము 🌴
శ్లో: 71. నఖానా ముద్యోతై ర్నవనళిన రాగం విహసతాం కరాణాం తే కాన్తిం కథయ కథయామః కథముమే కయాచిద్వా సామ్యం భజతు కలయా హస్తకమలం యది క్రీడల్లక్ష్మీ చరణతల లాక్షరసచణమ్ ll
🌷. తాత్పర్యం :
అమ్మా! పార్వతీదేవీ అప్పుడే వికసించిన కమలముల కాంతిని పరిహసించు చున్న నీ హస్తముల కాంతిని ఎట్లు వర్ణింతును? చెప్పుము. కమలములు కమలాలయములు అయిన లక్ష్మీదేవి పాదముల యందలి లత్తుక రసముతో కలసి అరుణిమ కాంతిని పొందిన యెడల కొద్దిగా పోల్చవచ్చునేమో కదా !
జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 12000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె నివేదించినచో భయాల నుండి విముక్తి, సంపదలు, యక్షిణీ దేవత వశీకరణము జరుగును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 71 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 71
🌴 Relief from all fears, purity of life, Getting of Wealth and making slave of Yakshini 🌴
71. Nakhanam uddyotai nava-nalina-ragam vihasatham Karanam te kantim kathaya kathayamah katham Ume; Kayachid va samyam bhajatu kalaya hanta kamalam Yadi kridal-lakshmi-charana-tala-laksha-rasa-chanam.
🌻 Translation :
Oh goddess uma,you only tell us, how,how we can describe,the shining of your hands, by the light of your nails, which tease the redness of freshly opened lotus? perhaps if the red lotus mixes,with the liquid lac adorning,the feet of Lakshmi, some resemblance can be seen.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 12000 times a day for 45 days, offering honey as prasadam, it is believed that they can control Yakshinis (Devatha)
🌻 BENEFICIAL RESULTS:
Relief from all fears, purity of life and control over yakshinis.
🌻 Literal Results:
Beneficial for instrumentalists, sculptors, dancers, designers etc. Purification.
🌹 🌹 🌹 🌹 🌹
12.Aug.2020
📚. ప్రసాద్ భరద్వాజ
72 వ శ్లోకము
🌴. భయాల నుండి విముక్తి, దేవత దయ సంపాదించుటకు 🌴
శ్లో: 72. సమం దేవి స్కన్దద్విపవదనపీతం స్తనయుగం
తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖమ్
యదాలోక్యాశజ్కాకులిత హృదయో హాసజనకః
స్వకుమ్భౌ హేరమ్బః పరిమృశతి హస్తేన ఝటితి ll
🌷. తాత్పర్యం :
అమ్మా! పాలు కారుచున్న నీ వక్షముల జంటను చూసి గణపతి తన శిరస్సు కుంభములు ఇచ్చటకు వచ్చేనేమో అని తలచి తొండముతో తన తలను తాకి చూసుకుంటున్నాడు కదా. ఒకే సమయమున కుమారులు అయిన గణపతి, కుమారస్వాము ల చేత పానము చేయబడినవో, అట్టి స్తన ద్వయము మాకు మేలు కలిగించును. కదా !
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె నివేదించినచో అన్ని రకాల భయాల నుండి విముక్తి, దేవతల నుండి దయ లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 𝓢𝓸𝓾𝓷𝓭𝓪𝓻𝔂𝓪 𝓛𝓪𝓱𝓪𝓻𝓲 - 72 🌹
📚 Prasad Bharadwaj
SLOKA - 72
🌴 Conquering fear of Darkness, Getting Grace from Goddess 🌴
72. Samam devi skanda dwipa vadana peetham sthanayugam Thavedham na khedham harathu sathatham prasnutha mukham Yada loakakhya sankha kulitha hridayo hasa janaka Swa kumbhou herambha parisrusathi hasthena jhhaddithi
Which have faces that always,give out milk,and are simultaneously drunk deeply. by skanda and the elephant faced ganesha,destroy all our sorrows.seeing them and getting confused,the herambha feels for his two frontal globes,to see whether they are there,making you both laugh.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 45 days, offering honey as prasadam, it is believed that they can overcome forms of fear in life and can get grace from goddess.
🌻 BENEFICIAL RESULTS:
Freedom from all fears, safe travel and gets strength of mind.
🌻 Literal Results:
Good for nursing mothers, increase in breast milk. Prosperity and peace of mind.
🌹 🌹 🌹 🌹 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
73 వ శ్లోకము
🌴. తల్లులకు పాలు సమృద్ధిగా ఉండుటకు, స్వయం జాగృతి శక్తి 🌴
శ్లో: 73. అమూ తే వక్షౌజా వమృత రసమాణిక్యకుతుపౌ
న సన్దేహాస్పన్దో నగపతిపతాకే మనసినః పిబన్తౌ తౌ యస్మా దవిదితవధూసజ్గరసికౌ
కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌll
🌷. తాత్పర్యం :
అమ్మా! పర్వత రాజు అయిన హిమవంతునుకి పేరు తెచ్చిన ఓ తల్లీ, నీ కుచములు అమృత రసముతో నిండి,మాణిక్యములతో నిర్మింపబడిన కుప్పెలు అనుటకు మాకు ఎటువంటి సందేహమునూ లేదు.ఎందుకు అనగా ఆ కుచముల పాలు త్రాగిన గణపతి,కుమారస్వాములు ఇప్పటికినీ బాలురు గానే ఉన్నారు. కదా !
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 8 రోజులు జపం చేస్తూ, తేనె నివేదించినచో తల్లులకు పాలు సమృద్ధిగా ఉండుట, స్వయం జాగృతికి కావలసిన శక్తి లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 ꜱᴏᴜɴᴅᴀʀʏᴀ ʟᴀʜᴀʀɪ - 73 🌹
📚. Prasad Bharadwaj
📚. ప్రసాద్ భరద్వాజ
74 వ శ్లోకము
🌴 కర్తి ప్రతిష్ఠలు 🌴
శ్లో: 74. వహత్యమ్బ స్తమ్బేరమదనుజకుమ్భ ప్రకృతి భి సమారబ్దాం ముక్తామణిభిరమలాం హారలతికామ్ కుచాభోగో బిమ్బాధరరుచిభి రస్తశ్శబలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతేll
అమ్మా! నీ మెడలో ధరించిన హారము ముత్యములచే కూర్చబడినదియూ, దోష రహితమై నిర్మలమైనదియూ, దొండపండు వంటి పెదవి యొక్క కాంతులచే చిత్ర వర్ణముగా చేయబడి ఈశ్వరుని పరాక్రమము తో కూడిన కీర్తి ని వహించుచున్నట్లుగా కనబడుచున్నది.
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 108 సార్లు ప్రతి రోజు 3 రోజులు జపం చేస్తూ, పాయాసం నివేదించినచో కీర్తి ప్రతిష్ఠలు లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Ş๏µи∂ɑяýɑ Łɑђɑяı - 74 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 74
🌴 Good Fame 🌴
74. Bahathyambha sthamberam dhanuja kumbha prakrithibhi Samaarabhdham muktha mamibhi ramalam haara lathikam Kuchabhogo bhimbhadara ruchibhi rathna saabhalitham Prathapa vyamishram puradamayithu keerthimiva thee
🌻 Translation :
Oh mother mine. The center place of your holy breasts, wear the glittering chain, made out of the pearls, recovered from inside the head of gajasura, and reflect the redness of your lips, resembling the bimba fruits, and are coloured red inside. You wear the chain with fame, like you wear the fame of our Lord. Who destroyed the three cities.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 108 times a day for 3 days, offering milk payasam as prasadam, it is believed that they will attain popularity in their life.
🌻 BENEFICIAL RESULTS:
Attainment of fame, erudition and honour.
🌻 Literal Results:
Attainment of fame, neck-ornaments, support and protection.
🌹 🌹 🌹 🌹 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
75 వ శ్లోకము
🌴. అశుధారగా కవిత్వం చెప్పుటకు 🌴
శ్లో: 75. తవస్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః పయఃపారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య త్వ య త్కవీనాం ఫ్రౌఢానా మజని కమనీయః కవయితాll
🌻. తాత్పర్యం :
అమ్మా! పర్వత నందినీ నీ చనుబాలను హృదయమునుండి ప్రవహించుచున్న వాజ్మయముతో నిండిన పాలసముద్రము వలె నేను తలచు చున్నాను. ఎందువలన అనగా వాత్సల్యముతో నీవు ఇచ్చిన స్తన్యము త్రాగి ఈ ద్రవిడ బాలుడు ( శ్రీ శంకర భగవత్పాదులు) కవులలో మనోహరుడు అయిన కవి కాజాలడు. కదా !
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 12000 సార్లు ప్రతి రోజు 3 రోజులు జపం చేస్తూ, తేనె, పండ్లు, పొంగలి నివేదించినచో అశుధారగా కవిత్వం చెప్పడం వచ్చును అని చెప్పబడింది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sσυɳԃαɾყα Lαԋαɾι - 75 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 75
🌴 Capacity to Write Poems 🌴
75. Twa stanyam manye dharanidhara kanye hridhayatha Paya paraabhaara parivahathi saaraswathamiva Dhayavathya dhattham dravida sisu raaswadhya thava yat Kaveenam proudana majani kamaniya kavayitha
🌻 Translation :
Oh daughter of the king of mountains, I feel in my mind,That the milk that flows from your breast,Is really the goddess of learning, Sarswathi, In the form of a tidal wave of nectar. For, milk given by you, who is full of mercy, Made the child of Dravida, The king among those great poets,Whose works stole one's mind
Child of Dravida refers to The Tamil poet Tirugnana Sambandar who preceded Sankara
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 12000 times a day for 3 days, offering honey, pongal and fruits as prasadam, one is said to attain the power to concentrate in their work and turn as a scholar.
🌻 BENEFICIAL RESULTS:
Good memory and attention, fame and gift of poetry.
🌻 Literal Results:
Beneficial for composers,poets and for creative work. Great fame and recognition.
🌹 🌹 🌹 🌹 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
76 వ శ్లోకము
🌴. శక్తి, బలము సంపాదించుటకు, వైరాగ్యము, ప్రేమ యందు జయం 🌴
శ్లో: 76. హరక్రోధ జ్వాలా వళిభి రవళీఢేన వపుషా గభీరే తే నాభీసరసి కృతసజ్గో మనసిజః సముత్తస్థౌ తస్మాద చలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితిll
🌻. తాత్పర్యం :
అమ్మా! పర్వతరాజ కుమారీ ! మన్మధుడు పరమ శివుని కోపాగ్ని కీలలతో దహింప బడిన శరీరముతో నీ యొక్క లోతయిన నాభి మడువున దూకి తనను తాను కాపాడుకొనెను. కాలుచున్న వాని శరీరము చల్లారుట చేత వెడలిన పొగ తీగ బయల్పడగా , దానిని నీ యొక్క నూగారు ప్రాంతముగా కనబడుచున్నది కదా!
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 10 రోజులు జపం చేస్తూ, తేనె, అరటి పండ్లు, పెరుగున్నము నివేదించినచో అధికారము, శక్తి, బలము, తేజము, వైరాగ్యము లభించును అని చెప్పబడింది
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 76 🌹
📚 Prasad Bharadwaj
SLOKA - 76
🌴 power, energy, gloriy, Complete Renunciation and Victory in Love 🌴
76. Hara krodha jwalaavalibhir avaleedena vapusha Gabhire thee nabhisarasi kruthasangho manasija Samuthasthou thasmath achalathanaye dhoomalathika Janastham janithe thava janani romaavalirithi
🌻 Translation :
Oh daughter of the mountain,the god of love who is the king of the mind,being lit bytheflame of anger of shiva,immersed himself in the deep pond of thine navel.the tendril like smoke emanated from there,and mother, people think,that this is the line of hair,that climbs from your navel upwards.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 10 days, offering curd rice, coconut and fruits, curd rice as prasadam, it is believed that they can achieve success in life.
🌻 BENEFICIAL RESULTS:
Success in financial and legal affairs and knowledge of Self, if so intended.
🌻 Literal Results:
Activation of manipoorka chakram and anaahatha chakram, benefits due to the same.
🌹 🌹 🌹 🌹 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
77 వ శ్లోకము
🌴. సూక్ష్మ దృష్టి, అందరిని ఆకర్షించే శక్తి కొరకు 🌴
శ్లో: 77. యదేతత్కాళిన్దీ తనుతరతరజ్గౌ కృతి శివే కృశే మధ్యే కిఞ్చత్తవ జ్జనని యద్భాతి సుధియాం
విమర్దాదన్యోన్యం కుచకలశయో రన్తరగతం
తనూభూతం వ్యోమ ప్రవశిదివ నాభిం కుహరిణీమ్ll
🌻. తాత్పర్యం :
అమ్మా! భవానీ! నీ యొక్క నడుము నందు ముందుగా కనపడుచున్నది సన్నదియు అగు యమునా నది యొక్క సన్నని కెరటము యొక్క రూపము గలదిగా నల్లని అయిన చిన్న వస్తువును నీ కుచకుంభములు ఒకదానికి ఒకటి ఒరిపిడి వలన వాటి మధ్యన ఉన్న ఆకాశము చిన్నదయి క్రింద నాభి వరకు జారినదిగా కనబడుచున్నది . కదా !
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 10 రోజులు జపం చేస్తూ, తేనె, అరటి పండ్లు, పెరుగున్నము నివేదించినచో సూక్ష్మ దృష్టి, అందరిని ఆకర్షించే శక్తి లభించును అని చెప్పబడింది
🌹 🌹 🌹 🌹 🌹
🌹 𝚂𝚘𝚞𝚗𝚍𝚊𝚛𝚢𝚊 𝙻𝚊𝚑𝚊𝚛𝚒 - 𝟽𝟽 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 77
🌴 Gaining Micro Sight, Attracting Everyone 🌴
77. Yadhethath kalindhi thanu thara ngaa kruthi shive Krushe mahye kinchid janani thawa yadbhathi sudheeyam Vimardha -dhanyonyam kuchakalasayo -ranthara gatham Thanu bhootham vyoma pravishadhiva nabhim kuharinim
🌻 Translation :
The mother of universe who is shiva and shakthi,in the narrow part of the middle of your body.the learned men seem to see a line,which is in the shape of a small wave of the river yamuna,and which shines and glitters, and appears like the sky,made very thin by thine dense colliding breasts,entering your cave like navel.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 2000 times a day for 15 days, offering honey and fruits as prasadam, it is believed that they Gain Micro Sight and will have the capacity to attract everyone.
🌻 BENEFICIAL RESULTS:
Dominance over others, deep insight.
🌻 Literal Results:
Activation of manipooraka chakram. Ability to gain access to the most impossible situation or entity. Power, authority and influence.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
18.Aug.2020
78 వ శ్లోకము
🌴. అందరిని ఆకర్షించే శక్తి, సర్వత్రా విజయం 🌴
శ్లో: 78. స్థిరో గజ్గావర్తః స్తనముకుళరోమావళిలతా కలవాలం కుణ్డం కుసుమ శరతేజో హుతభుజః రతేర్లీలాగారం కిమపి తవ నాభి ర్గిరిసుతే బిలద్వారం సిధ్ధే ర్గిరిశనయనానాం విజయతే ll
🌻. తాత్పర్యం :
అమ్మా! పార్వతీ దేవీ! నీ యొక్క నాభిస్థానము చలనము లేని గంగానది యొక్క సుడిగుండము, కుచములు అనెడి పూవుల మొగ్గలతో నిండిన నూగారు అనెడు తీగెకు పాదునూ, మన్మధుని తేజస్సు అనెడి అగ్నికి హోమకుండము, రతీదేవి విహరించు స్థలము, ఈశ్వరుని నేత్రముల తపస్సిద్ధికి గుహాముఖము, వర్ణించుటకు వీలు కానిదయి ఉన్నది కదా !
ఈ శ్లోకమును 108 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పొంగలి, వడలు నివేదించినచో అందరిని ఆకర్షించే శక్తి, జీవితంలో విజయం లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 78 🌹
📚. Prasad Bharadwaj
🌹
SLOKA - 78
🌴 Attracting all the Universe 🌴
78. Sthiro gangavartha sthana mukula romaa vali latha Kalaabhalam kundam kusuma sara thejo hutha bhuja Rathe leelamgaram kimapi thava nabhir giri suthe Bhila dwaram siddhe rgirisa nayananam vijayathe
Oh daughter of the mountain is your navel a whirl pool in river ganga, which looks very stable! or is it the root of the climber, of the stream of your hair line, which has two breasts of yours as buds, or is it the homa fire, where the fire is the light from cupid, or is it the play house of rathi, the wife of god of love,or is it the opening to the cave,in which shiva's tapas gets fulfilled,i am not able to make up my mind!
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 108 times a day for 45 days, offering pongal and Vada (from urad Dhal) as prasadam, it is believed that they will be able to conquer kingdom and attain victory in their life.
🌻 BENEFICIAL RESULTS:
Favours from government, all round success.
🌻 Literal Results:
Great prosperity and promising future in the present occupation/job. Influence in society.
🌹 🌹 🌹 🌹 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
80 వ శ్లోకము
🌴. ఇంద్రజాల విద్యల యందు నైపుణ్యము, గొప్పదైన ఆరోగ్యము 🌴
శ్లో: 80. కుచౌ సద్యస్స్విద్య త్తటఘటిత కూర్పాసభిదురౌ
కషన్తౌ దోర్మూలేకనక కలశాభౌ కలయతా
తవ త్రాతుం భజ్గాదలమితి వలగ్నం తనుభువా
త్రిధా నద్దం దేవి త్రివళిలవలీవల్లిభిరవ ll
🌷. తాత్పర్యం :
అమ్మా! ఎప్పటికప్పుడు చెమటలు పట్టుచున్న పార్శ్వములు అంటుకొని పిగుల్చుటకు సిద్ధముగా ఉన్నవినూ,బాహు మూలములను ఒరుసుచున్నవియునూ సువర్ణ కుంభ కాంతి కలిగినట్టివినూ అయిన కుచములను నిర్మించుచున్న మన్మధుడు వీని బరువు వలన నడుమునకు భంగము కలుగకుండా మూడు ఏలకీ లతలచే మూడు ముడతలు గా చుట్టబడినదిగా యున్నది .కదా!
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె నివేదించినచో ఇంద్రజాల విద్యల యందు నైపుణ్యం, గొప్పదైన ఆరోగ్యము లభించును అని చెప్పబడింది
🌹 🌹 🌹 🌹 🌹
🌹 𝚂̷𝚘̷𝚞̷𝚗̷𝚍̷𝚊̷𝚛̷𝚢̷𝚊̷ 𝙻̷𝚊̷𝚑̷𝚊̷𝚛̷𝚒̷ - 𝟾̷𝟶̷ 🌹
📚 Prasad Bharadwaj
SLOKA - 80
🌴 Getting Remarkable Beauty and Becoming Expert in Magic 🌴
80. Kuchou sadhya swidhya-sthata-ghatitha koorpasabhidurou Kasnthou dhormule kanaka kalasabhou kalayatha Thava thrathum bhangadhalamithi valagnam thanubhava Thridha naddham devi trivali lavalovalli bhiriva
🌻 Translation :
Oh goddess mine,placed just below your shoulders,by cupid, the god of love,tearing your blouse which is attached,to your body by the sweat,when you think of the greatness of your lord,and resembling pots of gold,your breasts appear to be tied by him,securely three times,by the three creeper like folds.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 45 days, offering honey as prasadam, it is believed that they will become expert in magic and get Great Health
🌻 BENEFICIAL RESULTS:
Attainment of magical powers, success in betting, handsome personality.
🌻 Literal Results:
Rejuvenation, great health.
🌹 🌹 🌹 🌹 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
81 వ శ్లోకము
🌴. అగ్ని సంబంధ సమస్యల నివారణకు, అగ్ని ప్రమాదాలు జరగకుండా 🌴
శ్లో: 81. గురుత్వం విస్తారం క్షితిథరపతిః పార్వతి నిజాత్
న్నితమ్బాదాచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే
అతస్తే విస్తీర్ణో గురు రయ మశేషాం వసుమతీం
నితమ్బప్రాగ్భార స్స్థగయతి లఘుత్వం నయతి చ.ll
🌻. తాత్పర్యం :
అమ్మా! పార్వతీ దేవీ కొండలకు రాజు అయిన నీ తండ్రి హిమవంతుడు తన కొండ చరియల నుండి కొంత విస్తీర్ణము తీసి నీ వివాహ సమయమున భరణముగా ఉంచెను. అందువలన నీ పిరుదులు అతిశయముతో భూమిని కప్పుచున్నవి.అందువలన భూమి చిన్నతనము పొందుచున్నది.దేవికి భూమి ఆసనమయి ఉన్నది కదా!
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె, బెల్లం పాకం నివేదించినచో అగ్ని ప్రమాదాల నుండి రక్షణ, అగ్ని సంబంధ సమస్యల నివారణ లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 81 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 81
🌴 Stopping Fire accidents, fire based calamities 🌴
81. Guruthvam vistharam ksithidharapathi paravathy nijaath Nithambha Dhhachhidhya twayi harana roopena nidhadhe Athasthe vistheerno guruyamasesham vasumathim Nithambha-praabhara sthagayathi lagutwam nayathi cha
🌻 Translation :
Oh, daughter of the mountain, perhaps himavan, the king of mountains,gave readily as dowry to you,the density and breadth from his bottom,so that your behinds are broad and dense.and therefore they both hide all the world,and make the world light.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 16 days, offering Kuda Payasam (Made out of jaggery)and honey as prasadam, it is said to get relief from fire based calamities.
🌻 BENEFICIAL RESULTS:
Power to float on fire, freedom from fire accidents.
🌻 Literal Results:
Suitable for propitiating the planet Jupiter. Domination and authority.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
22.Aug.2020
------------------------------------ x ------------------------------------
🌹. సౌందర్య లహరి - 82 / Soundarya Lahari - 82 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
82 వ శ్లోకము
🌴. నీటి సంబంధ సమస్యల నివారణకు, జల తత్వం మీద విజయం, ఇంద్రుని వంటి శక్తుల కొరకు 🌴
శ్లో: 82. కరీన్ద్రాణాం శుణ్డాన్ కనక కదలీకాణ్డ పటలీ ముఖాభ్యా మూరుభ్యా ముభయమపి నిర్జిత్య భవతీ సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుధకరికుమ్భద్వయమసిll
🌻. తాత్పర్యం :
అమ్మా! శాస్త్రములు అన్నియు తెలిసిన ఓ హిమవంతుని తనయా ! నీవు దిగ్గజములయిన ఏనుగుల తొండములు, బంగారు అరటి బోదెల సముదాయమును , నీ రెండు తొడల చేతను జయించి, భర్త యగు పరమ శివునికి మోకాళ్ళ మీద నమస్కరించుటచే కఠినములు అయిన మోకాళ్ళతో దేవతా గజమయిన ఐరావతము కుంభముల జంటను జయించి ప్రకాశించు చున్నావు కదా !
🌻. జప విధానం - నైవేద్యం:- ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె, ద్రాక్ష పండ్లు నివేదించినచో జల ప్రమాదాల నుండి రక్షణ, జల తత్వం మీద విజయం, ఇంద్రదేవుని వంటి శక్తులు, నీటి సంబంధ సమస్యల నివారణ లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 82 🌹
📚 Prasad Bharadwaj
SLOKA - 82
🌴 Stopping Flood and Getting Powers like Indhra 🌴
82. Karrendranam sundan kanaka kadhali kaadapatali Umabhamurubhyam - mubhayamapi nirjithya bhavathi Savrithabhyam pathyu pranathikatinabham giri suthe Vidhigne janubhysm vibhudha karikumbha dwayamasi
🌻 Translation :
Oh daughter of the mountain, who knows the rules of the Vedas, using your two thighs, you have achieved victory over, the trunks of the elephant,and the golden pseudo stem of group of banana plants, and achieved victory over frontal globes, of Iravatha the divine elephant, by your holy round knees,which have become hard,by repeated prostrations to your lord.
🌻 Iravatha refers to the elephant on which Indra rides 🌻
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 45 days, offering honey and grape fruit as prasadam, it is believed that to overcome disasters such as flood, hurricane etc.
🌻 BENEFICIAL RESULTS:
Skills to float on or remain and water, ownership of mines and vast wealth.
🌻 Literal Results:
Abundant wealth, great prosperity.
🌹 🌹 🌹 🌹 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
83 వ శ్లోకము
🌴. శత్రువులను స్థంబింప చేయు శక్తి పొందడానికి 🌴
శ్లో: 83. పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే నిషజ్గౌ జజ్ఘే తే విషమవిశిఖో బాఢమకృత యదగ్రే దృశ్యన్తే దశశరఫలాః పాదయుగళీ నఖాగ్రచ్ఛద్మాన స్సురమకుటశాణై కనిశితాఃll
🌷. తాత్పర్యం :
అమ్మా! గిరి పుత్రికా ! అయిదు బాణములు కల మన్మధుడు రుద్రుని జయించుటకు తన బాణములు సరిపోవని తలచి నీ పిక్కలను అంబుల పొదిగా చేసుకొని, కాలి వ్రేళ్ళను బాణములుగా చేసుకొని, గోళ్ళను బాణముల చివరనున్న ఉక్కు ముక్కలుగా చేసుకొనెను.నీకు నమస్కరించు దేవతల కిరీటముల ఒరిపిడికి గోళ్ళ చివరి భాగములు అరిగి పోయి పదును పెట్టినవిగా ఉన్నవి కదా !
🌻. జప విధానం - నైవేద్యం:- ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 12 రోజులు జపం చేస్తూ, తేనె, పాయసం నివేదించినచో శత్రువులను స్థంబింప చేయు శక్తి లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹Soundarya Lahari - 83 🌹
📚 Prasad Bharadwaj
SLOKA - 83
🌴 Stopping of the Army 🌴
83. Paraa jenu rudhram dwigunasara garbhoy girisuthe Nishanghou Unghe thee vishamavishikho bhada -maakrutha Yadagre drishyanthe dasa satra phalaa paadayugali Nakhagrachadhyan sura makuta sanayika nishitha
🌻 Translation :
Oh daughter of the mountain, the five arrowed cupid, to win, rudhra your lord, has made your legs, in to an arrow case,with ten arrows in the end of the case, are your two feet, studded with ten of your so called nails,which are the ten steel tipped arrows, sharpened on the crowns of devas.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 12 days, offering honey, payasam as prasadam, it is believed that one can win over battles with enemies and enjoy victory.(Compared to Battles in ancient period with weapons, horses and elephants)
🌻 BENEFICIAL RESULTS:
In case of a nation, power to route enemy's army. In case of an individual, power to subdue enemies and obtain high positions.
🌻 Literal Results:
Obtaining power to single-handedly fight against large groups of enemies and to emerge victorious. Best sloka for effectively subduing enemies, especially in the form of abusive male spouse/lover.
🌹 🌹 🌹 🌹 🌹
🌹. సౌందర్య లహరి - 85 / Soundarya Lahari - 85 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
85 వ శ్లోకము
🌴 దుష్టశక్తుల నుండి రక్షింపబడుటకు 🌴
శ్లో: 85. నమోవాకం బ్రూమో నయన రమణీయాయ పదయో స్తవాస్మ్యె ద్వన్ధ్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యన్తం యదభిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కజ్కేళితరవే.ll
🌷. తాత్పర్యం :
అమ్మా! నీ పాదముల చేత తాడనమును కోరుచున్న ఉద్యాన వనమందు ఉన్న అశోక వృక్షములను చూచి పశుపతి అయిన ఈశ్వరుడు అసూయను చెందుచున్నాడో, కనులకు ఇంపయిన తడి లత్తుకతో కూడిన నీ పాదముల జంటకు ప్రణామములు.
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 12 రోజులు జపం చేస్తూ, తేనె, పాయసం, నివేదించినచో దుష్ట శక్తుల నుండి రక్షణ లభించును అని చెప్పబడింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹Soundarya Lahari - 85 🌹
📚 Prasad Bharadwaj
SLOKA - 85
🌴 Removing Fear of Ghosts 🌴
85. Namo vakam broomo nayana ramaneeyaya padayo Thavasmai dwandhaya sphuta ruchi rasalaktha kavathe Asooyathyantham yadhamihananaaya spruhyathe Passonamisana pramadhavana kamkhelitharave
🌻 Translation :
We tell our salutations,to thine two sparkling feet. which are most beautiful to the eyes, and painted by the juice of red cotton. we also know wellthat god of all animals, your consort is very jealous of the asoka trees in the garden, which yearn for kick by your feet.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 12 days, offering honey, milk payasam as prasadam, it is believed that they can overcome forms of fear of ghosts in life.
🌻 BENEFICIAL RESULTS:
Deiverance from hold of evil spirits, attainment of devotion to Devi.
🌻 Literal Results:
Relief from binding situations and people. Ability to bring about quick changes.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundary_lahari
26.Aug.2020
📚. ప్రసాద్ భరద్వాజ
86 వ శ్లోకము
శ్లో: 86. మృషాకృత్వా గోత్ర స్ఖలన మథ వైలక్ష్య నమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే చిరా దన్త శ్శల్యం దహన కృత మున్మూలితవతా తులాకోటిక్వాణైః కిలికిలి తమీశానరిపుణా ll
అమ్మా! పార్వతీ దేవీ ! పొరపాటుగా నీ భర్త అయిన శివుడు నీ వద్ద గంగ పేరు ఉచ్ఛరించి కలవరపాటున ఏమిచేయవలెనో తోచక నీకు నమస్కారము చేసిననూ భర్తను నీ పాదపద్మముతో తాడనము చేయగా, చిరకాలముగా శత్రువుగా ఉన్న మన్మధుడు నవ్విన నవ్వు నీ కాలి అందెల చప్పుడుగా వెలువడెను, కదా !
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 21 రోజులు జపం చేస్తూ, పాయసం, అరటి పండు, కొబ్బరికాయ నివేదించినచో దుష్ట శక్తుల నుండి విడుదల, రక్షణ, శత్రు విజయం లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 86
🌴 Removing Fear of Ghosts and Victory over Enemies 🌴
86. Mrisha krithva gothra skhalana matha vailakshya namitham Lalate bhartharam charana kamala thadayathi thee Chiradantha salyam dhahanakritha -munmilee thavatha Thula koti kkana kilikilith -meesana ripuna
🌻 Translation :
In a playful mood, after teasing you, about you and your family, and at a loss to control your love tiff, when your consort does prostrations, your lotus like feet touches his forehead, and the god of love, the enemy of your lord, who was burnt,by the fire from his third eye, and was keeping the enmity with your lord, like the ever hurting arrowmakes sounds like kili kili, from your belled anklets on the legs.
(kili kili refers to the sound of teasing also sound from anklets)
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 21 days, offering milk payasam, coconut and banana fruit as prasadam, it is believed that they can overcome forms of fearand evil spirit in life and can get victory over enemies
🌻 BENEFICIAL RESULTS:
Subduing enemies, warding off evil spirits, obtaining power and strength.
🌻 Literal Results:
Gaining strength and infrastructure to attack and subdue enemies.
🌹 🌹 🌹 🌹 🌹
27 Aug 2020
🌹. సౌందర్య లహరి - 87 / Soundarya Lahari - 87 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
87 వ శ్లోకము
🌴. భవిష్యత్తు సూచన, సర్ప భయ నివారణ 🌴
శ్లో: 87. హిమానీ హన్తవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశి చరమభాగే చ విశదౌ
వరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజన్తౌ సమయినాం
సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిమ్ ll
🌷. తాత్పర్యం :
అమ్మా! మంచుపర్వతము నందు నివశించుట యందు మిక్కిలి నేర్పు గల నీ పాదములు రాత్రి యందునూ, తెల్లవారుఝామున యందునూ నిర్మలముగా ప్రకాసించుచూ నీ భక్తులకు లక్ష్మిని ప్రసాదించుచూ, మంచుచే నసించునవియు, అర్ధరాత్రి ముడుచుకుని పోవునవియు లక్ష్మీదేవి కి నివాసము అయిన పద్మములను జయించుచున్నవి కదా. ఇందు వింత ఏమియు లేదు.
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 16 రోజులు జపం చేస్తూ, పాయసము, పండ్లు , కొబ్బరికాయ నివేదించినచో భవిష్యత్తు సూచన, పాముల భయము నుండి నివారణ లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 87 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 87
🌴 Foresee things and overcome fear of serpents in life 🌴
87. Himani-hanthavyam hima-giri-nivas'aika-chaturau Nisayam nidranam nisi charama-bhaghe cha visadau; Varam laksmi-pathram sriyam ati srijanthau samayinam Sarojam thvad-padau janani jayatas chitram iha kim.
🌻 Translation :
Oh mother mine, the lotus flower rots in snow,but your feet are aces in being in snow,the lotus flower sleeps at night,but your feet are wakeful night and after night,the lotus makes the goddess of wealth lakshmi live in it,but your feet gives lakshmi to its devotees, and so your two feet always wins over the lotus,what is so surprising in this?
(The term wealth is denoted for Lakshmi)
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 16 days, offering milk payasam ,coconut and fruits as prasadam, it is believed that they can overcome fear of serpents in life.
🌻 BENEFICIAL RESULTS:
Power to plan, to foresee things and get vast wealth.
🌻 Literal Results:
Accumulation of riches and jewellery.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
28 Aug 2020
🌹. సౌందర్య లహరి - 88 / Soundarya Lahari - 88 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
88 వ శ్లోకము
🌴. పశు ప్రవృత్తులపై అదుపునకు, క్రూర జంతువుల వశ్యత కొరకు 🌴
శ్లో: 88. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమఠీకర్పరతులాం కథం వా పాణిభ్యా ముపయమనకాలే పురభిదా యదాదాయ న్యస్తం దృషది దయామానేన మనసా ll
🌷. తాత్పర్యం :
అమ్మా! పార్వతీ ! కీర్తులకు నెలవయిన ఆపదలను దరి చేర నీయని నీ పాదముల పై భాగమును కవి శ్రేష్ఠులు తాబేలు వీపు చిప్పతో ఎట్లు పోల్చినారు? వివాహ సమయమున దయకలిగిన హృదయము కల ఈశ్వరుడు తన చేతులతో ఎత్తి సన్నికల్లు మీద ఎట్లు ఉంచినాడు?
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 6 నెలలు జపం చేస్తూ, పాయసము, పండ్లు , కొబ్బరికాయ నివేదించినచో స్వీయ పశు ప్రవృత్తులపై అదుపు, క్రూర జంతువుల వశ్యత, సమస్యల మీద అదుపు లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 88 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 88
🌴 Making wild Beasts Obey 🌴
88. Padham the kirhtinam prapadham apadham Devi vipadham Katham nitham sadbhih kutina-kamati-karpara-thulam; Katham vaa bahubhyam upayamana-kaale purabhida Yad adhaya nyastham drshadi daya-manena manasa.
🌻 Translation :
Oh, goddess devi,how did the poets compare,the foreside of your merciful feet,which are the source of fame to your devotees,and which are not the source of danger to them,to the hard shell of tortoise,i do not understand. how did he who destroyed the three cities,take them in his hand, and place them on hard rock, during your marriage?
🌻 It denotes a customary rite in Hindu marriage called asmarohanam
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 6 months, offering milk payasam, coconut and fruits as prasadam, it is believed that one can get control over own lower nature, control over troubles and can overcome fear of wild animals and bring them under our control.
🌻 BENEFICIAL RESULTS:
Controlling wild animals, freedom from troubles and prosperity.
🌻 Literal Results:
Great fame, enhances creativity controls brutal force.
🌹 🌹 🌹 🌹 🌹
29 Aug 2020
📚. ప్రసాద్ భరద్వాజ
89 వ శ్లోకము
🌴. సర్వ వ్యాధుల నివారణకు 🌴
శ్లో: 89. నఖై ర్నాక స్త్రీణాం కరకమల సజ్కోచశశిభి స్తరుణాం దివ్యానాం హసత ఇవ తే చణ్డి చరణౌ ఫలాని స్వస్థ్సేభ్యః కిసలయకరాగ్రేణ దధతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియ మనిశ మహ్నాయ దదతౌ ll
🌷. తాత్పర్యం :
అమ్మా! చండీ అను నామముతో ప్రసిద్ధిగాంచిన నీవు చిగురుటాకుల వంటి చేతులతో స్వర్గలోక వాసులయిన దేవతల కోర్కెలను తీర్చు కల్పవృక్షములను, సర్వలోకముల యందు ఉండు దరిద్రులకు కూడా ఎల్లప్పుడూ సంపదలను ఇచ్చు నీ పాదములు దేవతా స్త్రీల పద్మములవంటి చేతులను ముడుచు కొనునట్లు చేయు గోళ్ళను చంద్రుల చేత పరిహాసము చేయునట్లు ఉన్నవి . కదా!
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 30 రోజులు జపం చేస్తూ, పులగం నివేదించినచో సర్వ వ్యాధులు నుండి నివారణ, కోరిన కోరికలు సిధ్ధించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 ŚŐÚŃĎĂŔŶĂ ĹĂĤĂŔĨ - 89 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 89
🌴 Getting Rid of all Diseases 🌴
89. Nakhair naka-sthrinam kara-kamala-samkocha sasibhi Tarunam dhivyanam hasata iva te chandi charanau; Phalani svah-sthebhyah kisalaya-karagrena dhadhatam Daridhrebhyo bhadraam sriyam anisam ahnaya dhadhatau.
🌻 Translation :
Your moon like nails, oh mother who killed chanda, which makes the celestial maidens, fold their hands in shame, forever tease your two feet, which unlike the holy trees in heaven, which by their leaf bud like hands, give all they wish to the gods,give the poor people wealth and happiness, always and fast.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 30 days, offering kula (dal) payasam and honey as prasadam, it is believed that they can overcome all diseases in life and wishes fulfilled.
🌻 BENEFICIAL RESULTS:
Cure of all diseases, physical strength.
🌻 Literal Results:
Prayer to Chandi. Great physical strength, materialisation of wishes.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
30.Aug.2020
📚. ప్రసాద్ భరద్వాజ
90 వ శ్లోకము
🌴. దుష్ట మంత్ర ప్రభావం, దరిద్రము తొలగుటకు, 🌴
శ్లో: 90. దదానే దీనేభ్యః శ్రియమ నిశమాశాను సదృశీమమన్దం సౌందర్య ప్రకరమకరన్దం వికిరతి తవాస్మిన్ మన్దార స్తబకసుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కరణచరణై ష్షట్చరణతామ్ ll
🌷. తాత్పర్యం :
అమ్మా! భగవతీ! దీనులకు వారి వారి కోర్కెలకు అనుగుణముగా సంపదలు ఇచ్చు అధికమయిన లావణ్యము అను పూదేనెను వెదజల్లుచున్నదియూ, కల్ప కుసుమ పుష్ప గుచ్చము వలే సొగసైనదియు అగు నీ పాద కమలమునందు మనస్సుతో కూడిన జ్ఞానేంద్రియ పంచకము అను ఆరు పాదములు కలవాడనయి తుమ్మెద వలె మునుగుదును గాక !
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 30 రోజులు జపం చేస్తూ, తేనె, పాయసం నివేదించినచో దుష్ట మంత్ర ప్రభావాలు, దరిద్రము తొలగుతాయి అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 90 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 90
🌴 Cutting of Bad Spells cast, dispel poverty 🌴
90. Dhadhane dinebhyah sriyam anisam asaanusadhrusim Amandham saundharya-prakara-makarandham vikirathi; Tav'asmin mandhara-sthabhaka-subhage yatu charane Nimajjan majjivah karana-charanah sat-charanathaam.
🌻 Translation :
My soul with six organs,is similar to the six legged honey bees,which dip at your holy feet,which are as pretty, as the flower bunch, of the celestial tree,which always grant wealth to the poor, whenever they wish, and which without break showers floral honey.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 30 days, offering payasam and honey as prasadam, one can overcome the effect of bad spells and to dispel poverty
🌻 BENEFICIAL RESULTS:
Removal of charms and enchantments by enemies, dispel poverty.
🌻 Literal Results:
Patronage of high society, gains influence, control of senses.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
31.Aug.2020
🌹. సౌందర్య లహరి - 91 / Soundarya Lahari - 91 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
91 వ శ్లోకము
🌴. ధనము, భూములు అభివృద్ధి చెందుటకు 🌴
శ్లో: 91. పదన్యాస క్రీడా పరిచయ మివారబ్ధు మనసః స్ఖలన్త స్తే ఖేలం భవన కలహంసా న జహతి అత స్తేషాం శిక్షాం సుభగమణి మఞ్జీర రణిత చ్ఛలాదాచక్షాణం చరణ కమలం చారుచరితే ll
🌷. తాత్పర్యం :
అమ్మా! మనోహరమయిన చరిత్ర కలిగిన ఓ తల్లీ ! నీవు నడుచునప్పుడు నీ పాదముల మనోహరములయిన లయను నేర్చుకొనవలెనని నీ పెంపుడు హంసలు తొట్రుపాటు విడువకున్నవి. నీ పాద పద్మముల యొక్క అందెల శబ్దములు వాటికి పాఠము చెప్పుచున్నట్లుగా ఉన్నది. కదా !
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 2000 సార్లు ప్రతి రోజు 25 రోజులు జపం చేస్తూ, మీరు అత్యుత్తమమని భావించినది నివేదించినచో ధనము, భూములు అభివృద్ధి చెందును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 91 🌹
📚 Prasad Bharadwaj
SLOKA - 91
🌴 Getting of Land and Getting Riches 🌴
91. Pada-nyasa-kreeda- parichayam iv'arabdhu- manasah Skhalanthas the khelam bhavana-kala-hamsa na jahati; Atas tesham siksham subhaga-mani-manjira-ranitha- Chchalad achakshanam charana-kamalam charu-charite.
🌻 Translation :
She who has a holy life,the swans in your house, follow you without break,as if to learn, your gait which is like a celestial play. So thine lotus like feet,taking recourse to the musical sound, produced by gems in your anklets,appears to teach them what they want.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 2000 times a day for 25 days, offering anything that is considered as best by your goodself as prasadam, it is believed that one will get opportunities to acquire land and accumulate wealth.
🌻 BENEFICIAL RESULTS:
Buying of lands, obtaining riches, contact with great men and scholars.
🌻 Literal Results:
Ideal for dancers. Patronage and mass support.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
01 Sep 2020
📚. ప్రసాద్ భరద్వాజ
92 వ శ్లోకము
🌴. రాజ్య లాభం పొందుటకు, పోయిన ఆస్తులు తిరిగి పొందుటకు 🌴
శ్లో: 92. గతాస్తే మఞ్చత్వం ద్రుహిణహరి రుద్రేశ్వరభృతః
శివస్స్వచ్ఛచ్చాయా కపటఘటిత ప్రచ్ఛదపటః
త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా
శరీరీ శృజ్గారో రస ఇవ దృశాం దోగ్ధికుతుకమ్.ll
🌷. తాత్పర్యం :
అమ్మా! దేవీ ! బ్రహ్మ విష్ణువురుద్ర ఈశ్వరులుఅను వేల్పులు నీకు మంచత్వమును పొంది యుండగా కప్పుకొను దుప్పటి లాగున ఉన్న సదాశివ తత్వము తెల్లని కాంతులు కలిగి నీకు ఆనందము కలుగ జేయుచున్నది .కదా!
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 4000 సార్లు ప్రతి రోజు 30 రోజులు జపం చేస్తూ, రకరకములైన అన్నము నివేదించినచో రాజ్య లాభము, రాజ్యమును పరిపాలన చేయగల సత్తా, పోయిన ఆస్తులు తిరిగి లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 𝕊𝕠𝕦𝕟𝕕𝕒𝕣𝕪𝕒 𝕃𝕒𝕙𝕒𝕣𝕚 - 𝟡𝟚 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 92
🌴 Getting ability to Rule, Recovering lost property 🌴
92. Gataas the mancathvam Druhina-Hari-Rudr'eshavara-bhrutah Sivah svacchac- chaya-ghatita-kapata-pracchada-pata; Tvadhiyanam bhasaam prati-phalana-rag'arunathaya Sariri srungaro rasa iva dhrisam dhogdhi kuthukam.
🌻 Translation :
Brahma, Vishnu, Rudhra and Easwara, who are the gods who rule the world, become the four legs of your cot, so that they are able to serve you always Sada Shiva who is white in colour becomes the bed spread on which you sleep, and appears red, because he reflects your colour.and to your eyes which are the personification, of the feelings of love, he gives lot of happiness.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 4000 times a day for 30 days, offering variety rice as prasadam, it is believed that one will get opportunities to conquer kingdom and the ability to rule and Recovery of lost property
🌻 BENEFICIAL RESULTS:
Recovery of lost property, getting large estates and vast knowledge.
🌻 Literal Results:
Support and patronage in high circles. Easy and lucky life.
🌹 🌹 🌹 🌹 🌹
ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
02 Sep 2020
📚. ప్రసాద్ భరద్వాజ
93 వ శ్లోకము
🌴. సర్వాభిష్టములు నెరవేరుటకు 🌴
శ్లో: 93. అరాళా కేశేషు ప్రకృతిసరళా మన్ద హసితే శిరీషాభా చిత్తే దృష దుపల శోభా కుచతటే
భృశం తన్వీ మధ్యే పృథు రురసిజారోహ విషయే
జగత్త్రాతుం శమ్భోర్జయతి కరుణా కాచిదరుణా.ll
🌷. తాత్పర్యం :
అమ్మా! జగన్మాతా! కురులయందు మాత్రమె వంకర కలిగి చిరునవ్వు నందు సహజముగానే చక్కదనము కలిగి మనస్సునందు దిరిసెన పూవు వలె మెత్త దనము కలిగి అందమయిన శరీరము కలిగి అనిర్వచనీయ మయినదియు పరమ శివుని కరుణా స్వరూపమయిన అరుణ అను శక్తి లోకములను రక్షించు మహిమ కలదిగా ప్రకాశించు చున్నది. కదా !
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 2000 సార్లు ప్రతి రోజు 25 రోజులు జపం చేస్తూ, తేనెను నివేదించినచో సర్వాభిష్టములు నెరవేరునని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 93 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 93
🌴 Fulfillment of Desires 🌴
93. Araala kesheshu prakruthi-saralaa manda-hasithe Sireeshabha chite drushad upala-sobha kucha-thate; Bhrusam thanvi madhye pruthur urasijh'aroha-vishaye Jagat trathum sambhor jayahti karuna kaachid aruna.
🌻 Translation :
Her mercy which is beyond the mind and words of our lord Shiva, is forever victorious in the form of Aruna, so as to save this world.that spirit of mercy is in the form of, curves in her hairs, in the form of natural sweetness in her smile. In the form of pretty tenderness of a flower in her mind,in the form of firmness of a ruby stone in her breasts, in the form of thin seductiveness in her hips, in the form of voluptuousness in her breasts and back.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 2000 times a day for 25 days, offering honey as prasadam, one is said to be bestowed with all they desire in their life.
🌻 BENEFICIAL RESULTS:
All desires fulfilled, obtaining wealth and prosperity.
🌻 Literal Results:
Happiness, contentment, sound health and prosperity.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
03.Sep.2020
📚. ప్రసాద్ భరద్వాజ
94 వ శ్లోకము
🌴 విజయం లభించుటకు, ఆపార్ధాలు, అపనిందలు తొలగుటకు 🌴
శ్లో: 94. కళజ్కః కస్తూరీ రజనికరబిమ్బం జలమయం కళాభిః కర్పూరై ర్మరకతకరణ్డం నిబిడితమ్ అతస్త్వద్భోగేన ప్రతిదిన మిదం రిక్త కుహరం విధిర్భూయోభూయో నిబిడయతి నూనం తవ కృతే.ll
🌷. తాత్పర్యం :
అమ్మా చంద్రబింబము అనగా మరకతమణులచే నిర్మించబడిన పెట్టె. అందు నీవు రోజూ ఉపయోగించు పన్నీరు, కస్తూరి, కర్పూరము పలుకులు ఉంచి రోజూ ఉపయోగించుట వలన ఖాళీ అయిన వాటిని బ్రహ్మ దేవుడు మాటిమాటికి నింపును. కదా ఇది సత్యము.
🌷. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 108 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పొంగలి, పండ్లు నివేదించినచో సర్వాభిష్టములు దైవానుగ్రహము వలన నెరవేరునని, విజయం సంప్రాప్తించును, మరియు ఆపార్ధాలు, అపనిందలు తొలగును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 94 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 94
🌴 Getting all Desires, Clears misunderstandings, blames 🌴
94. Kalankah kasthuri rajani-kara-bimbham jalamayam Kalabhih karpurair marakatha-karandam nibiditam; Athas thvad-bhogena prahti-dinam idam riktha-kuharam Vidhir bhuyo bhuyo nibidayathi nunam thava krithe.
🌻 Translation :
The moon that we know is thine jewel box,filled with water of incense,the blackness we see in the moon,the musk put for thy use in this box,and the crescents we see of the moonis thy canister of emerald,full of divine camphor.and for sure,brahma the creator refills these daily,after your use,so that they are always full.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 108 times a day for 45 days, offering pongal and fruits as nivedhyam, it is said that all their desires will be fulfilled, and Clears misunderstandings, blames with the blessings of the lord.
🌻 BENEFICIAL RESULTS:
Getting great renown, moksha (liberation), bright face.
🌻 Literal Results:
Ideal sloka for people born during waning moon period. Clears misunderstandings, blames, public scandals etc. Also suitable for reviving closed chapters (business/personal). Face becomes radiant.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
04.Sep.2020
📚. ప్రసాద్ భరద్వాజ
95 వ శ్లోకము
🌴. మొండి వ్రణములు, గాయములు మానుటకు 🌴
శ్లో: 95. పురారాతేరన్తః పురమసి తాత స్త్వచ్చరణయో స్సపర్యామర్యాదా తరళకరణానా మసులభా తథా హ్యేతే నీతాశ్శత మఖముఖాస్సిద్ధి మతులాం తవ ద్వారోపాన్తస్ధితిభి రణిమాద్యాభిరమరాః.ll
🌷. తాత్పర్యం :
అమ్మా! నీవు పురారి అయిన పరమ శివుని పట్టపు రాణివి కావున, నీ పాదపద్మములను పూజించు భాగ్యము చపల చిత్తులకు లభించదు. అందువలన ఇంద్రాది దేవతలు ద్వారము వద్ద ఉన్న అణిమాది సిద్ధుల వలననే అభీష్టములు పొందిన వారైరి కదా.
🌷. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 108 సార్లు ప్రతీ రోజూ 45 రోజులు జపం చేస్తూ, తిలలు కలిపిన అన్నము, చక్కెర నివేదించినచో, అన్ని రకముల గాయములు మానిపోవును అని చెప్పబడింది.
జపం తరువాత ప్రతీరోజు నివేదించిన తిలల నూనెను వ్రణములపై పట్టించవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 95 🌹
📚 Prasad Bharadwaj
SLOKA - 95
🌴 Curing all injuries 🌴
95. Pur'arather antah-puram asi thathas thvach-charanayoh Saparya-maryadha tharala-karananam asulabha; Thatha hy'ethe neetah sathamukha-mukhah siddhim athulam Thava dvar'opantha-sthithibhir anim'adyabhir amarah.
🌻 Translation :
You are leading light of the home of lord shiva, who destroyed the three cities,and so coming near you and worshipping at thine feet,are not for those with weak mind,who do not have control of their senses.and that is why perhaps,indra and other gods,stay outside your gates,and attain your sweet self,by practice of siddhis like anima.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 108 times a day for 45 days, offering Tillannam (Ellu rice) and sugar it is believed that all injuries can be cured.
🌻 BENEFICIAL RESULTS:
Cure of nervous debility, relief from debts and sins, gift of poesy.
🌻 Literal Results:
Security and nervous strength.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
05.Sep.2020
📚. ప్రసాద్ భరద్వాజ
96 వ శ్లోకము
🌴. విజ్ఞానము, సంపదలు అభివృద్ధి చెందుటకు 🌴
శ్లో: 96. కళత్రం వైధాత్రం కతికతి భజన్తేన కవయః శ్రియో దేవ్యాః కోవా న భవతి పతిః కైరపి ధనైః
మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే
కుచాభ్యా మాసజ్గః కురువక తరోరప్యసులభః.ll
🌷. తాత్పర్యం :
అమ్మా! ఓ పతివ్రతా శిరోమణి! ఎందరెందరో కవులు సరస్వతీ దేవిని సేవింతురు? ఎందరో సంపదల వలన లక్ష్మీ దేవికి అధిపతులు అగును కదా. అమ్మా నీ ఉద్యానవనమున ఉన్న గోరింట చెట్టునకు కూడా నీవు పతితో కలసియే ఆలింగనము చేయుదువు కదా.
🌷. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతీ రోజూ 45 రోజులు జపం చేస్తూ, తేనె, పాయసము నివేదించినచో విజ్ఞానము, మరియు సంపదలు అభివృద్ధి చెందును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 96 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 96
🌴 Attainment of Knowledge and Wealth 🌴
96. Kalathram vaidhathram kathi kathi bhajante na kavayah Sriyo devyah ko va na bhavati pathih kairapi dhanaih; Mahadevam hithva thava sathi sathinam acharame Kuchabhyam aasangah kuravaka-tharor apyasulabhah.
🌻 Translation :
Many poets reach the goddess of learning, the wife of the creator,by composing soulful poems.many who search and attain riches, are termed as the lord of the goddess of wealth.oh, first among chaste woman, except lord shiva your consort. Your breasts have not even touched, the holy henna tree. the henna tree is supposed to wish for the embrace of maidens
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 45 days, offering honey and milk payasam as nivedhyam, it is said that they will attain good knowledge and wealth.
🌻 BENEFICIAL RESULTS:
Healing of long-standing wounds, peace of mind, influence over others.
🌻 Literal Results:
Women can attain loving spouse, strengthening marital relationships.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
06.Sep.2020
📚. ప్రసాద్ భరద్వాజ
97 వ శ్లోకము
🌴. వాక్ శక్తి, శరీర ధారుఢ్యము కొరకు 🌴
శ్లో: 97. గిరామాహుర్ దేవీం ద్రుహిణగృహిణీ మాగమ విదో హరేః పత్నీం పద్మాం హర సహచరీ మద్రి తనయామ్
తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి.ll
🌷. తాత్పర్యం :
అమ్మా! పరమాత్మ యగు పరమ శివుని రాణి వగు ఓ తల్లీ, ఆగమవేత్తలు నిన్ను బ్రహ్మదేవుని ఇల్లాలు అగు సరస్వతీ దేవిగాను , విష్ణువు సతియగు లక్ష్మీదేవి గాను శివుని సహచరి అయిన పార్వతి గాను చెప్పుచున్నారు. కాని నీవు యీ ముగ్గురు కంటే అపార మహిమ కలిగి సకల ప్రపంచమును మోహింప చేయు చున్నావు కదా.
🌷. జప విధానం - నైవేద్యం:- ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతీ రోజూ 8 రోజులు జపం చేస్తూ, తేనె, నివేదించినచో వాక్ శక్తి, వాక్శుద్ధి లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 97 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 97
🌴 Redemption of the Soul 🌴
97. Giram aahur devim Druhina-gruhinim agaamavidho Hareh pathnim padhmam Hara-sahacharim adhri-thanayam; Thuriya kapi thvam dhuradhigama-niseema-mahima Maha-maya visvam bhramayasi parabhrahma mahishi.
🌻 Translation :
Oh, parashakthi who is one with parabrahma,though those who have learned vedas,call you as brahma's wife sarawathi,or call you as vishnu's wife lakshmi,or call you as shiva's wife parvathi,you are the fourth called maha maya,who gives life to the world,and have attained all that is to attain.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 8 days, offering honey as nivedhyam, it is said that one will attain the power to turn his words true.
🌻 BENEFICIAL RESULTS:
Erudition, youthful energy and appearance, robust body.
🌻 Literal Results:
Leadership,great physical strength.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
07.Sep.2020
📚. ప్రసాద్ భరద్వాజ
98 వ శ్లోకము
🌴 సంతానం కలుగుటకు 🌴
శ్లో: 98. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం
పిబేయం విద్యార్ధీ తవ చరణ నిర్జేజనజలమ్
ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా
కదాథత్తే వాణీముఖ కమల తామ్బూల రసతామ్.ll
🌷. తాత్పర్యం :
అమ్మా! బ్రహ్మ విద్యను అర్ధించు నేను లత్తుక రసము కలుపబడిన నీ పాదోదకము ఎప్పుడు త్రాగుదునో కదా ! ఆ నీరు చెవిటి వారికి విను శక్తిని, మూగ వారికి మాట్లాడు శక్తిని ఇచ్చును కదా !
🌷. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతీ రోజూ 45 రోజులు జపం చేస్తూ, తేనె, పాలు నివేదించినచో సంతానం అనుగ్రహించ బడును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 98 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 98
🌴 By blessing of the goddess the girl would conceive 🌴
98. Kadha kaale mathah kathaya kalith'alakthaka-rasam Pibheyam vidyarthi thava charana-nirnejana-jalam; Prakrithya mukhanam api cha kavitha-karanathaya Kadha dhathe vani-mukha-kamala-thambula-rasatham.
🌻 Translation :
Oh, mother mine,when shall i, who begs for knowledgebe able to drink, the nectar like water,flowing from your feet,mixed with reddish lac applied there?when shall that water attain,the goodness of saliva mixed with thambula, from the mouth of goddess of learning, which made one born as mute, into the king of poets?
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 45 days, offering honey, Milk as nivedhyam, it is to be believed that by blessing of the goddess the girl would conceive giving the couple happiness forever.
🌻 BENEFICIAL RESULTS:
Virility and divine knowledge for men, pregnancy for women desirous of children.
🌻 Literal Results:
Eloquence, magnetic speech, creative prowess and great knowledge.
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
08.Sep.2020
99 వ శ్లోకము
🌴. ఆరోగ్యం, సంపదలు జీవన సౌఖ్యము లభించుటకు 🌴
శ్లో: 99. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరిసపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరం జీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికరః పరానన్దా భిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్.ll
🌷. తాత్పర్యం :
అమ్మా! నిన్ను సేవించు నీ భక్తుడు సరస్వతీ దేవి, లక్ష్మి దేవి లకు ఇష్టుడయి వారితో విహరించుట వలన బ్రహ్మకు, విష్ణు మూర్తికి అసూయ కలిగించు చున్నాడు. మంచి అందముతో రతీదేవి పాతివ్రత్య భంగము కలిగించుచున్నాడు. అతడు చిరకాలము బ్రహ్మానందము అను సుఖమును పొందుచున్నాడు. కదా !
🌷. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతీ రోజూ 15 రోజులు జపం చేస్తూ, తేనె, మినప వడలు, పులగం నివేదించినచో ఆరోగ్యం, సంపదలు జీవన సౌఖ్యము లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 99 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 99
🌴 Attain all the wealth and comforts 🌴
99. Saraswathya lakshmya vidhi hari sapathno viharathe Rathe pathivrithyam sidhilayathi ramyena vapusha Chiram jivannehva kshapathi pasu pasa vyathikara Paranandabhikhyam rasayathi rasam twadjanavaan.
🌻 Translation :
Those who worship thee, oh mother,are so learned and so rich, that even brahma and vishnu, are jealous of themthey are so handsome,that even the wife of cupid, rathi, yearns for them. He unbound from the ties of this birth, always enjoys ecstatic happiness, and lives for ever.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 15 days, offering Vada (Urad Dal), pongal and honey as nivedhyam, one is said to attain all the wealth and comforts in their life.
🌻 BENEFICIAL RESULTS:
Virility and divine knowledge for men, pregnancy for women desirous of children.
🌻 Literal Results:
Eloquence, magnetic speech, creative prowess and great knowledge.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
09.Sep.2020
📚. ప్రసాద్ భరద్వాజ
100 వ శ్లోకము - చివరి భాగము
🌴. దైవీశక్తి, ఆనుగ్రహము, ఆనందము లభించుటకు 🌴
శ్లో:100. ప్రదీపజ్వాలాభి ర్ధివసకరనీరాజనవిధి స్సుధాసూతే శ్చంద్రో పలజలలవై రర్ఘ్యరచనా
స్వకీయై రంభోభి స్సలిలనిధి సాహిత్య కరణం త్వదీయాభి ర్వాగ్భి స్తవ జనని వాచాం స్తుతి రియమ్ll
🌷. తాత్పర్యం :
అమ్మా! నీవు ఇచ్చిన వాక్కుల చేత నిన్ను స్తుతించుచూ చేయు వాక్కులు సూర్యునికి దివిటీల చేత నీరాజనము ఇచ్చుట వంటిది.
( అహంకారము త్యజించి సర్వమూ శ్రీ దేవి కరుణ అని శంకర భగవత్పాదులు ఈ స్తోత్రములను ముగించెను.)
🌻 జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతీ రోజూ 16 రోజులు జపం చేస్తూ, త్రిమధురం,, తేనె, పాలు, చక్కెర నివేదించినచో దైవీక సిద్ధులు, సంపూర్ణ ఆరోగ్యం, సంపదలు, ఆనందం లభించును అని చెప్పబడింది.
🌻 🌻 🌻 🌻 🌻
ఇతి శ్రీ శంకర భగవత్పాదుల విరచిత సౌందర్యలహరి సంపూర్ణమ్.
తత్ఫలం శ్రీ లలితా పరమేశ్వరార్పణ మస్తు.
🌻. తెలుగు శ్లోక తాత్పర్యం సమకూర్చిన వారు మంత్రాల పూర్ణచంద్రయ్య గారు.
🌻. సౌందర్య లహరి 1 నుండి 100 శ్లోకములు పాడినది - చిరంజీవి శివ పల్లవి
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 100 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 100 - Last Part
🌴 Attainment of all Occult Powers 🌴
100. Pradhipa-jvalabhir dhivasa-kara-neerajana-vidhih Sudha-suthes chandropala-jala-lavair arghya-rachana; Svakiyair ambhobhih salila-nidhi-sauhitya karanam Tvadiyabhir vagbhis thava janani vacham stutir iyam.
🌻 Translation :
Just as doing 'niraanjana' ( the flame waving ritual) to the sun is only the offering of his own light to him; just as making an offering of arghya to the moon with water that oozes out of the moon-stone is only to give back what belongs to the moon, and just making 'tharpana' - water-offering to the ocean is to return what belongs to it, -so is, O source of all Learning, this hymn is addressed to Thee composed of words that are already Thine."
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 16 days, offering trimadhuram and lemon (Jambubalam) as nivedhyam, one is said to attain all powers, knowledge, glory and wisdom in their life.
🌻 BENEFICIAL RESULTS:
All round success, freedom from diseases and accomplishment of all desires.
🌻 Literal Results:
Retrieving lost property, gaining control of belongings and contentment.
The End 🙏
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
10.Sep.2020
No comments:
Post a Comment