*🌹 సౌందర్య లహరి - 50 / Soundarya Lahari - 50 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
50 వ శ్లోకము
*🌴. మశూచికం నివారణకు, సృజనాత్మకత, కళల నైపుణ్యం 🌴*
శ్లో: 50. కవీనాం సందర్భస్త బక మకరం దైక రసికం
కటాక్షవ్యా క్షేప భ్రమర కలభౌ కర్ణయుగలమ్l
అముంచన్తౌ దృష్ట్యా తవ నవరసాస్వాదతరళౌ
అసూయాసంసర్గా దళికనయనం కించి దరుణమ్ll
🌻. తాత్పర్యం :
అమ్మా ! కవీంద్రుల రచనల యందున్న రచనల యొక్క పూదేనెను ఆస్వాదించుటకు ఇష్టము కలిగి, కర్ణములను విడువక నవ రసాస్వాదమునందు ఆసక్తి కలిగి ఉన్న గండు తుమ్మెదల జంటను చూచి నీ ఫాల నేత్రము అసూయతో ఎర్రబడినది కదా!
🌻. జప విధానం - నైవేద్యం :--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 10 రోజులు జపం చేస్తూ, చక్కెర, చెరకును నివేదించినచో మశూచికము, ఇతర రోగముల నివారణ జరుగును మరియు సృజనాత్మకత, కళల నైపుణ్యం పెరుగును అని చెప్పబడింది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SOUNDARYA LAHARI - 50 🌹*
📚. Prasad Bharadwaj
SLOKA - 50
*🌴 Seeing afar and Curing of Small-Pox - Creative skills 🌴*
50. Kavinam sandharbha-sthabaka-makarandh'aika-rasikam Kataksha-vyakshepa-bhramara-kalabhau-karna-yugalam; Amunchantau drshtva tava nava-ras'asvada tharalau- Asuya-samsargadhalika-nayanam kinchid arunam.
🌻 Translation :
Thine two long eyes, oh goddess, are like the two little bees which want to drink the honey, and extend to the ends, with a pretense of side glances, to thine two ears, which are bent upon drinking the honey, from the flower bunch of poems presented by your devotees, and make thine third eye light purple, with jealousy and envy.
Chanting procedure and Nivedyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 5 days, offering sugar and sugarcane as prasadam, it is believed that they will be cured from pox, other diseases and increase of Creative skills.
🌻 BENEFICIAL RESULTS:
Prevetion and quick cure of small pox and dissentry (consuming of water or butter, on which yantra is drawn is prescribed).
🌻 Literal Results:
Poetic instincts enhanced. Creative skills.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment