Wednesday, July 22, 2020

🌹. సౌందర్య లహరి - 43 / Soundarya Lahari - 43 🌹

*🌹. సౌందర్య లహరి - 43 / Soundarya Lahari - 43 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

43 వ శ్లోకము

*🌴. సర్వ కార్య జయం, పలుకుబడి అభివృద్ధి చెందుటకు 🌴*

శ్లో: 43. ధునోతు ధ్వాంతం న స్తులితదలితేందీవరవనం 
ఘనస్నిగ్ధంశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివేl 
యదీయం సౌరభ్యం సహజ ముపలబ్ధుం సుమనసో 
వసంత్యస్మిన్మన్యే బలమథన వాటీ విటపినామ్ ll*l 
 
🌻. తాత్పర్యము :
అమ్మా ! అప్పుడే వికసించిన నల్లకలువలెను, నల్లని మేఘముల వలె దట్టముగా ఉండి సుకుమారమయి ఉన్న నీ కేశముల ముడి మా అజ్ఞానము అనబడు చీకటిని పారద్రోలును. వాటినుండి వెలువడు సువాసనలను పీల్చుటకు బలుడు అను రాక్షసుని చంపిన ఇంద్రుని కల్పవృక్షముల యొక్క పూలు వాటిని ఆశ్రయించును కదా ! 
 
🌻. తాత్పర్యము :
అమ్మా ! నీ యొక్క మూలాధార చక్రమునందు సమయ అను పేరు గల కళతో లాస్య రూపమయిన తొమ్మిది రసములతో నాట్యమునందు మిక్కిలి ఆసక్తురాలవై ఆనందభైరవి అను శక్తితో కూడి నవరసములతో తాండవ నృత్యము చేయువానిని ఆనంద భైరవునిగా తలచెదను.దగ్ధమయిన ఈ జగత్తును మరల ఉత్పత్తి చేయు ఉద్దేశ్యముతో కలసిన ఈ ఆనందభైరవి భైరవులచే ఈ జగత్తు తల్లిదండ్రులు కలదిగా పుట్టును కదా ! 
  
🌻. జప విధానం - నైవేద్యం :

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 40 రోజులు జపం చేస్తూ, పాల అన్నం, వండిన అన్నం, పప్పు , తేనె నివేదించినచో సర్వ కార్యముల యందు జయము, సంఘము నందు పలుకుబడి కలుగును అని చెప్పబడింది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Soundarya Lahari - 43 🌹* 
📚 Prasad Bharadwaj 

SLOKA - 43 

*🌴 victory in all kinds works and become famous 🌴*

Dhunotu dhvaantam nas tulita-dalit'endivara-vanam Ghana-snigdha-slakshnam chikura-nikurumbham thava sive; Yadhiyam saurabhyam sahajamupalabdhum sumanaso Vasanthyasmin manye vala-madhana-vaati-vitapinam.

🌻 Translation :
Oh, goddess, who is the consort of Shiva, let the darkness of our mind be destroyed, by the crowning glory on your head, which is of like the forest of opened blue lotus flowers, and which is soft, dense and shines with luster believe my mother, that the pretty flowers of Indra's garden, are all forever there, to get the natural scent of thine hair.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 
If one chants this verse 1000 times a day for 40 days, offering honey, cooked rice, Dal and milk rice as prasadam, it is said that one would overcome all problems and get victory in all aspects, Gains influence in society.

🌻 BENEFICIAL RESULTS: 
Cure of ordinary diseases, success in all endeavours. 
 
🌻 Literal Results:
 Enhances hair growth. Gains influence in society.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari

No comments:

Post a Comment

𝐏𝐎𝐖𝐄𝐑 𝐎𝐅 𝐄𝐀𝐂𝐇 𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀 𝐋𝐀𝐇𝐀𝐑𝐈 𝐒𝐇𝐋𝐎𝐊𝐀 - 00

🌹.   𝐏𝐎𝐖𝐄𝐑  𝐎𝐅  𝐄𝐀𝐂𝐇  𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀  𝐋𝐀𝐇𝐀𝐑𝐈  𝐒𝐇𝐋𝐎𝐊𝐀   🌹 📚.  Prasad Bharadwaj 1. Winning in every field 2. Att...