*🌹. సౌందర్య లహరి - 42 / Soundarya Lahari - 42 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*42 వ శ్లోకము*
*🌴. సర్వాకర్షణ కొరకు, జలోధర వ్యాధి నశించుకుపోవుటకు, సూర్య చంద్ర దోషముల నివారణ 🌴*
శ్లో: 42. గతై ర్మాణిక్యతం గగన మణిభిః సాంద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః l
స నీడేయచ్ఛా యాచ్ఛురణ శబలం చంద్రశకలం
ధనుః శౌనాశీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ ll
🌻. తాత్పర్యము :
అమ్మా! మంచు పర్వత రాజ పుత్రికా ! నవ రత్నముల తత్వమును పొందిన సూర్యులచే కూర్చబడిన చక్కగా రత్నములు పొదుగబడి బంగారముతో చేయబడిన నీ కిరీటమును ఏ సాధకుడు కీర్తించుచున్నాడో అతడు కిరీటము యొక్క కుదుళ్ళ యందు బిగింపబడిన రత్నముల యొక్క కాంతులతో చిత్ర విచిత్రముగా మెరయుచున్న చంద్ర రేఖను చూచి ఇంద్రుని ధనుస్సు అని ఎలా తలచకుండా ఉండును, తలచును కదా !
అమ్మా ! నీ యొక్క మూలాధార చక్రమునందు సమయ అను పేరు గల కళతో లాస్య రూపమయిన తొమ్మిది రసములతో నాట్యమునందు మిక్కిలి ఆసక్తురాలవై ఆనందభైరవి అను శక్తితో కూడి నవరసములతో తాండవ నృత్యము చేయువానిని ఆనంద భైరవునిగా తలచెదను.దగ్ధమయిన ఈ జగత్తును మరల ఉత్పత్తి చేయు ఉద్దేశ్యముతో కలసిన ఈ ఆనందభైరవి భైరవులచే ఈ జగత్తు తల్లిదండ్రులు కలదిగా పుట్టును కదా !
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పాలు, చక్కెర , నివేదించినచో జలోధర వ్యాధి నివారణ, జాతకంలో సూర్య చంద్ర దోషములు తొలగును, సర్వాన్ని ఆకర్షించే శక్తి, ఉన్నత స్థాయి కలుగును అని చెప్పబడింది.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Soundarya Lahari - 42 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 SLOKA - 42 🌻*
*🌴 Attracting Everything and Curing Diseases caused by Water, Remedy for sun and moon related problems 🌴*
Gathair manikyatvam gagana-manibhih-sandraghatitham. Kiritam te haimam himagiri-suthe kirthayathi yah; Sa nideyascchaya-cchurana-sabalam chandra-sakalam Dhanuh saunasiram kim iti na nibadhnati dhishanam.
🌻 Translation :
Hey daughter of the ice mountain, he who chooses to describe, your crown, bedecked with shining jewels, which are but the transformed form, and arranged very close to one another, of the twelve holy suns, will see the crescent in your crown, in the dazzling light of those jewels, and think them as a rainbow, which is but the bow of Indra.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 45 days, offering milk and sugar as prasadam, it is said that one would overcome water related diseases and attraction towards everything.
🌻 BENEFICIAL RESULTS:
Cures oedema, urinal diseases, gives power to attract others.
🌻 Literal Results:
Remedy for sun and moon related problems in the natal chart. Attaining high position and accumulation of gems.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
No comments:
Post a Comment