Tuesday, July 9, 2019

🌹. సౌందర్య లహరి - 15 / Soundarya Lahari - 15 🌹


🌹. సౌందర్య లహరి - 15 / Soundarya Lahari - 15 🌹

📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ


🌻. కవిత్వం - విజ్ఞానంలో అభివృద్ధి చెందుటకు 🌻

 

శ్లో: 15. శరజ్జ్యోత్స్నా శుధ్ధాం - శశియుత జటాజూటమకుటాం 

వరత్రాసత్రాణ స్ఫటికఘటికా పుస్తక కరామ్ 

సకృన్నత్వా న త్వా కథమివ సతాం సన్నిదధతే 

మధుక్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయఃll 

 

🌻. తాత్పర్యముః 

అమ్మా ! శరత్కాలమునందు ఉండు వెన్నెల వలె నిర్మలమయిన శరీరము కల దానవు, పిల్ల జాబిల్లితో కూడిన జడ ముడి ఉన్న కిరీటము కల దానవు, కోరికలు తీర్చు వరముద్ర, భయమును పోగొట్టు అభయముద్ర కల దానవు, స్ఫటిక పూసల జపమాలను, పుస్తకమును చేతుల యందు ధరించిన నిన్ను ఒక్క పరి అయినా నమస్కరించు సజ్జనులకు తేనె, ఆవు పాలు, ద్రాక్ష పండ్ల యొక్క మధురములను అందించు వాక్కులు రాకుండా యెట్లు ఉండును. తప్పక వచ్చును కదా !


🌻. జప విధానం - నైవేద్యం :-

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేసి తేనె, పండ్లు, చక్కెర నివేదిస్తే, కవిత్వములో, విజ్ఞాన శాస్త్రములో నిపుణత్వము పొందుతారు అని చెప్పబడింది.

🌹 🌹 🌹 🌹 🌹 


🌹 Soundarya Lahari - 15 🌹 

📚. Prasad Bharadwaj 


🌻 Ability to Write Poems and ability to Become Scholar 🌻


15. Saraj-jyotsna-shuddham sasi-yuta-jata-juta-makutam Vara-traasa-traana-sphatika-ghutika-pustaka karaam; Sakrn na thva nathva katham iva sathaam sannidadhate Madhu-kshira-drakhsa-madhurima-dhurinah phanitayah.


🌻 Translation :

Sweetest words rivaling the honey, milk and grapes, can only come to the thoughts of the devotee, who once meditates on your face, which is like the white autumn moon, on your head with a crown with the crescent moon and flowing hair, and hands that shower boons and give protection, which hold the crystal chain of beads and books.


🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :


If one chants this verse 1000 times every day for 45 days, and offers Honey, fruits and sugar as nivedhyam , one is said to gain the ability to write poems and become a scholar.


🌻 BENEFICIAL RESULTS: 

Getting poetic imagination and enlightenment. 

 

🌻 Literal Results: 

Attaining wisdom over disturbing issues. Enjoying sweet foods. Creative intellect gets enhanced, elevation in academics. 

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment

𝐏𝐎𝐖𝐄𝐑 𝐎𝐅 𝐄𝐀𝐂𝐇 𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀 𝐋𝐀𝐇𝐀𝐑𝐈 𝐒𝐇𝐋𝐎𝐊𝐀 - 00

🌹.   𝐏𝐎𝐖𝐄𝐑  𝐎𝐅  𝐄𝐀𝐂𝐇  𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀  𝐋𝐀𝐇𝐀𝐑𝐈  𝐒𝐇𝐋𝐎𝐊𝐀   🌹 📚.  Prasad Bharadwaj 1. Winning in every field 2. Att...