Tuesday, July 9, 2019

🌹. సౌందర్య లహరి - 11 / Soundarya Lahari - 11 🌹


🌹. సౌందర్య లహరి - 11 / Soundarya Lahari - 11 🌹 

📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ


🍃. సంతానము కోసం 🌹


🌻. శ్లో: 11. చతుర్భిః శ్రీకంఠైః - శివయువతిభిః పంచభిరపి 

ప్రభిన్నాభిః శంభో - ర్నవభి రపి మూలప్రకృతిభిఃl 

చతుశ్చత్వారింశ- ద్వశుదళ కళాశ్ర త్రివలయ 

త్రిరేఖాభిః సార్ధం - తవ శరణకోణాః పరిణతాః ll 

 

 🌻. తాత్పర్యము : 

అమ్మా ఈశ్వరీ ~ శ్రీచక్రం~ నాలుగు శివచక్రాలు, వాటి‌నుండి విడివడిన ఐదు‌ శక్తి చక్రాలతో ఉన్నది. ప్రపంచానికి మూలకారణమైన తత్త్వముతో కూడిన నీ నివాసమైన శ్రీచక్రంలోని కోణాలు~ అష్టదళాలు~ షోడశదళ పద్మాలు~ మేఖలాతంత్రంగా మూడు భూపురాలు కలిసి నలభైనాలుగు అంచులు కలిగి‌ వున్నాయి.‌ 


బాష్యము :

బిందు~త్రికోణ~ వసుకోణ~ దశారయుగ్మ~ మన్వస్ర~ నాగ దళ షోడస పత్ర యుక్తంచ~ ధరణీ సదనత్రయంచ~ శ్రీచక్ర రాజ ఉదితః పరదేవతాయాః అను నీ నివాసమగు శ్రీచక్ర వర్ణనలో అత్యంత శోభాయమానముగా అత్యంత సౌష్టవరీతిలో బ్రహ్మాడ~పిండాండ, సృష్టి~ప్రళయ విజ్ఞాన సమస్త రహస్యములను సంకేత పూర్వకముగా పొందుపరచబడిన యంత్ర రాజమే శ్రీచక్రము. అన్ని తంత్రములకు~ అన్ని‌ యంత్రములకు ~ అన్ని‌ మంత్రములకు దీని యందు సమన్వయము దొరుకును. అందుచేతనే దీనిని యంత్ర రాజము~ శ్రీచక్రరాజము అని అందురు. అటువంటి శ్రీచక్ర స్వరూపమైన మీఇరువురికీ నా నమస్సులు తల్లీ!!! 


🌻. జప విధానం - నైవేద్యం :


ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 40 రోజులు జపం చేసి బూరెలు, వెన్న నివేదిస్తే, మంచి ప్రయోజనకరమైన, వంశ ప్రతిష్ఠ ను నిలిపే సంతానము కలుగును.


🌹 Soundarya Lahari - 11 🌹

📚. Prasad Bharadwaj 


🌻. Good Progeny, Getting a Meaning for Life 🌻


🌻. Sloka :

Chaturbhih shri-kantaih shiva-yuvatibhih panchabhir api Prabhinnabhih sambhor navabhir api mula-prakrthibhih; Chatus-chatvarimsad vasu-dala-kalasra-trivalaya- Tri-rekhabhih sardham tava sarana-konah parinatah


🌻. Translation : 

With four wheels of our lord Shiva ,and with five different wheels of you, my mother, which are the real basis of this world, your house of the holy wheel, has four different parts of eight and sixteen petals, three different circles, and three different lines, making a total of forty four angles.

                                                                                  

🌻. Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :


If one chants this verse 1000 times every day for 40 days, and offers butter and Boorelu as nivedhyam , one is said to be blessed with a lovely male baby to represent their family ‘s riches and name.


🌻 BENEFICIAL RESULTS: 

Barren women become pregnant, getting issues. The butter used for drawing Yantra to be consumed daily.


🌻 Literal Results: 

Intricate problems being solved.

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment

𝐏𝐎𝐖𝐄𝐑 𝐎𝐅 𝐄𝐀𝐂𝐇 𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀 𝐋𝐀𝐇𝐀𝐑𝐈 𝐒𝐇𝐋𝐎𝐊𝐀 - 00

🌹.   𝐏𝐎𝐖𝐄𝐑  𝐎𝐅  𝐄𝐀𝐂𝐇  𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀  𝐋𝐀𝐇𝐀𝐑𝐈  𝐒𝐇𝐋𝐎𝐊𝐀   🌹 📚.  Prasad Bharadwaj 1. Winning in every field 2. Att...