Tuesday, July 9, 2019

🌹. సౌందర్య లహరి - 13 / Soundarya Lahari - 13🌹


🌹. సౌందర్య లహరి - 13 / Soundarya Lahari - 13 🌹 

📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ 


🌻. దైవీ ప్రేమ - విశేష భక్తి నందు స్థిరత్వము 🌻

 

శ్లో: 13. నరం వర్షీయాంసం- నయనవిరసం నర్మసు జడం 

తవాపాంగాలోకే - పతితమనుధావంతి శతశఃll 

గళద్వేణీబంధాః - కుచకలశవిస్రస్త సిచయాః 

హఠా త్తృట్యత్కాంచ్యో విగళిత దుకూలా యువతయః 

 

🌻. తాత్పర్యము : 

అమ్మా ! ఏ పురుషుడు ముదుసలి అయి శరీరము ముడుతలు పడి, కళ్ళనిండా పుసులు ఉండి మసక చూపు కలిగి, శృంగార భాషణములు కూడా చేయలేని మూఢుడయిన వాడు అయినా నీ క్రీగంటి చూపులకు పాత్రమయిన వానిని చూచుటకు వందల కొలది మదవతులు తమ జుట్టు ముడులు విడిపోవుచున్ననూ, పయ్యెదలు జారిపోవు చుండగా, బంగారు మొలనూలులు జారిపోవుచుండగా వానిని చూచుటకు పరిగెత్తుకుని వెంట పడుతున్నారు కదా.  


🌻. జప విధానం - నైవేద్యం:


ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 6 రోజులు జపం చేసి త్రిమధురమును లేదా అన్నమును నివేదిస్తే, లోతైన సత్య ప్రేమ యందు, విశేష భక్తి నందు స్థిర పడుదరని చెప్పబడింది. 


🌹 Soundarya Lahari - 13 🌹

📚. Prasad Bharadwaj


🌻. Victory in the matters of Love and devotion. 🌻


13. Naram varshiyamsam nayana virasam narmasu jadam, Thava panga loke pathitha manudhavanthi sathasa Gala dweni bhandha kuch kalasa visthrutha sichaya Hatath thrudyath kanchyho vigalidha dhukoola yuva thaya. 


🌻 Translation : 

With disheveled hair, with upper cloths slipping from their busts, with the lock of the golden belt getting open due to the haste, and with saris slipping away from their shoulders, hundreds of young lasses, run after the men, who get your sidelong glance, even though they are very old, bad looking and not interested in love sports. 


🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :  


If one chants this verse 1000 times every day for 6 days, and offers Trimadhuram or rice as nivedhyam ,it is said that one can attain victory in divine love and Devotion. 


🌻 BENEFICIAL RESULTS :

Power to attract women and cures impotency.


🌻 Literal Results : 

Ability to magnetise women. Increase of virility in men.

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment

𝐏𝐎𝐖𝐄𝐑 𝐎𝐅 𝐄𝐀𝐂𝐇 𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀 𝐋𝐀𝐇𝐀𝐑𝐈 𝐒𝐇𝐋𝐎𝐊𝐀 - 00

🌹.   𝐏𝐎𝐖𝐄𝐑  𝐎𝐅  𝐄𝐀𝐂𝐇  𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀  𝐋𝐀𝐇𝐀𝐑𝐈  𝐒𝐇𝐋𝐎𝐊𝐀   🌹 📚.  Prasad Bharadwaj 1. Winning in every field 2. Att...