Tuesday, July 9, 2019

🌹. సౌందర్య లహరి - 20 / Soundarya Lahari - 20 🌹


🌹. సౌందర్య లహరి -20 / Soundarya Lahari - 20 🌹

📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ 


🌻. కుండలినీ దోషముల నుండి, విష ప్రాణుల నుండి రక్షణ, జ్వర, తాపముల నుండి బయటపడుట 🌻


శ్లో: 20. కిరంతీ మంగేభ్యః - కిరణ నికురుంబామృతరసం 

హృది త్వామాధత్తే - హిమకరశిలామూర్తిమివ యఃl 

స సర్పాణాం దర్పం - శమయతి శకుంతాధిప ఇవ 

జ్వరప్లుష్టాన్ దృష్ట్యా - సుఖయతి సుధాధారసిరయాll 

 

🌻. తాత్పర్యముః 

అమ్మా ! పాదముల మొదలు శరీరము అంతటి కిరణముల నుండి ప్రసరించు చున్న అమృతము ను కురిపించుచున్న చంద్రకాంత శిల్పా మూర్తిగా నిన్ను ఏ సాధకుడు ప్రార్ధించు చున్నాడో అట్టి వాడు గరుత్మంతుని వలె పాముల నుండీ వెలువడుచున్న విషమును హరింప చేయుచున్నాడు, జ్వరముతో భాధింప పడు వానిని అమృతము ధారగా కలిగిన తన నాడుల యొక్క శీతలమయిన చూపుచేత జ్వరబాధను తగ్గించి సుఖమును కలుగ చేయుచున్నాడు కదా! 


🌻. జప విధానం - నైవేద్యం :

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 40 రోజులు జపం చేసి క్షీరాన్నము నివేదిస్తే, కుండలినీ దోషముల నుండి, విష ప్రాణుల నుండి రక్షణ, జ్వరములు మరియు వివిధ మనో తాపముల నుండి బయట పడగలరు అని చెప్పబడింది.

🌹 🌹 🌹 🌹 🌹 


🌹Soundarya Lahari - 20 🌹

📚. Prasad Bharadwaj 


🌻. Protection from kundalini errors - poisoned beings - control over fevers and emotions. 🌻


20. Kirantim angebhyah kirana-nikurumba'mrta-rasam Hrdi tvam adhatte hima-kara-sila murthimiva yah; Sa sarpanam darpam samayati sakuntadhipa iva Jvara-plustan drshtya sukhayati sudhadhara-siraya.


🌻 Translation :

He who meditates in his mind, on you who showers nectar from all your limbs, and in the form which resembles, the statue carved out of moonstone, can with a single stare, put an end to the pride of snakes, and with his nectar like vision, cure those afflicted by fever.


🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :


If one chants this verse 1000 times every day for 40 days, and offers milk payasam as nivedhyam , one can get protection from kundalini errors, poisoned beings, and control over fevers and negative emotions.


🌻 BENEFICIAL RESULTS :

Cure of poisonous fevers, antidote against poison, cures effects of evil eyes, confers power to charm snakes and other poisonous reptiles.


🌻 Literal Results:

Cures fever, effects of evil eyes ,mitigates evil results of debilitated or misplaced moon in one's chart and adds lustre to one's body.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #prasadbhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari

🌹. సౌందర్య లహరి - 19 / Soundarya Lahari - 19 🌹


🌹. సౌందర్య లహరి -19 / Soundarya Lahari - 19 🌹

✍️. సంకలనము : ప్రసాద్ భరద్వాజ


🌻. ప్రకృతి మీద వశత్వము - విజయము 🌻


శ్లో: 19.ముఖం బిందుం కృత్వా కుచయుగ మథ స్తస్య తదథో 

హరార్ధం ధ్యాయోద్యో హరమహిషి తే మన్మథ కలామ్l 

స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతిలఘు 

త్రిలోకీ మప్యాశు భ్రమయతి రవీందుస్తన యుగామ్ll 

 

🌻. తాత్పర్యముః 

అమ్మా! పరమశివుని పత్నీ~ పార్వతీ~ శ్రీచక్రం లోని బిందువును నీ ముఖముగాను~ దాని‌ క్రింద స్తనములు~ ఆ క్రింద శివుని శరీరం లోని సగమైన శక్తిని~ బిందువు క్రింది త్రికోణం లో 'క్లీం ' బీజాన్ని భావిస్తూ ఎవడు ధానిస్తాడో అతడు త్రిలోకాలనూ మోహపెట్టగలడు కదా తల్లీ... అంతటి గొప్పదనం నీ మేరు స్వరూపానిది కదా ! 


🌻. జప విధానం - నైవేద్యం:

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేసి తేనె, పాలు, పంచదార నివేదిస్తే, ప్రకృతి మీద వశత్వమును పొందుతారు అని చెప్పబడింది.


🌹Soundarya Lahari -19 🌹

📚. Prasad Bharadwaj 


19. Mukham bindun kruthva kucha yuga mada sthasya thadha dho Harardha dhyayedhyo haramamahishi the manmathakalam Sa sadhya samkshebham nayathi vanitha inyathiladhu Thrilokimapyasu bramayathi ravindu sthana yugam.


🌻 Translation : 

Hey, mother who is goddess of all universe, he who meditates on you with Kleem beeja, as the crescent of love of our lord great, on the dot of the holy wheel, your two busts just below, and you as the half of Shiva, our lord, not only creates waves of emotion in Nature, but charms the world, which has moon and sun as busts.


🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :


If one chants this verse 1000 times every day for 45 days, and offers Honey, milk and sugar as nivedhyam , one can achieve victory over Nature and its creation.


🌻 BENEFICIAL RESULTS:

Attracting young women, gaining influence in royal courts as well as in government. Control over wild animals.


🌻 Literal Results:

Meditation powers enhanced. Enticing women, appeasing the planets sun and moon in the horoscope.

🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 18 / Soundarya Lahari - 18 🌹


🌹. సౌందర్య లహరి - 18 / Soundarya Lahari - 18 🌹 

📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. దైవీ ప్రేమ యందు విజయము, మోహ నాశనము, చిత్రకళల నైపుణ్యము. 🌻


శ్లో: 18. తనుచ్ఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః దివంసర్వా ముర్వీ మరుణిమ నిమగ్నాం స్మరతి యఃl భవంతస్య త్రస్య ద్వనహరిణ శాలీన నయనాః సహోర్వశ్యా వశ్యాః కతికతి నగీర్వాణ గణికాఃll 

 

🌷. తాత్పర్యం : 

అమ్మా ! ఉదయపు సూర్యుని శోభను పోలిన శోభ కలిగిన నీ శరీరమును ఎఱ్ఱ దనముతో నిండిన ఆకాశముగా ఎవ్వరు పూజించు చున్నారో అట్టి వారు, తొట్రుపాటు పడుచూ అడవుల యందున్న లేళ్ళ కన్నుల వంటి కన్నులు కల అప్సరసలకు సైతము వశము కారు కదా ! 


🌻. జప విధానం - నైవేద్యం :


ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేసి తేనె, పాలు, తాంబూలము నివేదిస్తే, దైవీ ప్రేమ యందు విజయము, మోహ నాశనము, చిత్రకళల యందు నైపుణ్యము పొందుతారు అని చెప్పబడింది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Soundarya Lahari - 18 🌹

📚. Prasad Bharadwaj 


🌻 Victory in divine Love - get rid of Attachment - expertise in Arts 🌻


18. Thanuschayabhi sthe tharuna-tharuni -srisarinibhi Divam sarva-murvi-marunimani magnam smaranthi ya Bhavanthasya thrasya-dhwana-harina shaleena nayana Sahervasya vasya kathikathi na geervana Ganika


🌷 Translation : 

He who meditates on, the luster of your beautiful body, which is blessed by the rising sun, and which dissolves the sky and the world light purple hue, Will not fall for celestial damsels like uravasi and others, who have eyes like the wild startled deer.


 🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :


If one chants this verse 1000 times every day for 45 days, and offers Honey, milk and thambulam as nivedhyam , one can achieve divine Love, getting Rid of Attachments, Become expert in Arts and Crafts.


🌻 BENEFICIAL RESULTS: 

Deep knowledge in sciences, getting good bridegrooms in the case of marriageable women and blessings of great men. 

 

🌻 Literal Results:

Adds lustre and magnetism to body and face. The double "vashya" in the sloka creates magnetic aura around the devotee, 'the rising sun' in the sloka implies new beginnings. This sloka is also a prayer to the planet, Sun (if misplaced in horoscope or debilitated or during Surya Mahadasa). 

🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 17 / Soundarya Lahari - 17 🌹


🌹. సౌందర్య లహరి -17 / Soundarya Lahari - 17 🌹

📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ 


🌻. వాక్కు, పదముల యందు శక్తిని, అన్ని శాస్త్రాలలో ప్రావీణ్యత 🌻


 శ్లో: 17. సవిత్రీభిర్వాచాం - శశిమణిశిలాభంగరుచిభి 

ర్వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యఃl 

స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభి 

ర్వచోభిర్వాగ్దేవీ - వదన కమలామోదమధురైఃll 

 

🌻. తాత్పర్యముః

అమ్మా ! చంద్ర కాంత మణుల శిలా కాంతి వంటి కాంతి కలిగి వసిన్యాది అష్ట శక్తులతోనూ ద్వాదశ యోగినులూ కలిగిన నిన్ను ఎవ్వడు చక్కగా ధ్యానము చేయు చున్నాడో అతడు కాళిదాస వ్యాసాదులు మొదలుగా గల మహాత్ముల రచనల వలె మనోహరములయినట్టియు సరస్వతీదేవి ముఖ కమలము యొక్క పరిమళములు గల రచనలు చేయుటకు సమర్ధులు అగుచున్నారు కదా !


🌻. జప విధానం - నైవేద్యం :

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేసి తేనె, పాలు, చెరకు మరియు చక్కెర నివేదిస్తే, వాక్కు, పదములు యందు శక్తిని, అన్ని రకముల శాస్త్రముల యందు ప్రావీణ్యత పొందుతారు అని చెప్పబడింది.

🌹 🌹 🌹 🌹 🌹 


🌹 Soundarya Lahari - 17 🌹

📚. Prasad Bharadwaj 


🌻 Mastery over Words and Knowledge of all Sciences 🌻


17. Savitribhir vacham Chasi-mani-sila-bhanga-rucibhir Vasiny'adyabhis tvam saha janani samchintayati yah; Sa karta kavyanam bhavati mahatam bhangi-rucibhih Vacobhi vagdevi-vadana-kamal'amoda madhuraii.


🌻 Translation : 

Oh, mother holy, he who worships you, along with the goddess likvasini, whare the prime source of words, and you who are having the great luster, got by breaking the moon stone, becomes the author of great epics, which shine like those written by great ones, and which have the sweet scent of the face of the goddess of knowledge.


🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :


If one chants this verse 1000 times every day for 45 days, and offers Honey, Milk, sugarcane and sugar as nivedhyam , one is said to be the master of sciences, power over words and Shastras.


🌻 BENEFICIAL RESULTS: 

Gives erudition, knowledge of Vedas, Shastras and different languages. Immunity from effects of evil spirits. 

 

🌻 Literal Results:

Magnetic personality and speech. Radiance adding lustre to complexion. 

🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 16 / Soundarya Lahari - 16 🌹


🌹. సౌందర్య లహరి -16 / Soundarya Lahari - 16 🌹

📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ


🌻. వేదములు - ఉపనిషత్తులు అర్థం చేసుకోగల శక్తి 🌻

 

శ్లో: 16. కవీంద్రాణాం చేతః - కమల వన బాలాతపరుచిం 

భజంతే యే సంతః - కతిచి దరుణా మేవ భవతీమ్l 

విరించి ప్రేయస్వా స్తరుణ తర శృంగార లహరీ 

గభీరాభి ర్వాగ్భి - ర్విదధతి సతాం రంజన మమీ ll 

 

🌻. తాత్పర్యముః 

అమ్మా ! కవి శ్రేష్ఠుల చిత్తములనెడి పద్మ వనములకు బాల సూర్యుని కాంతివగు అరుణ అను నామము కల నిన్ను ఏ కొందరు సత్పురుషులు సేవించుచున్నారో వారు బ్రహ్మ ప్రియురాలు అగు సరస్వతీదేవి వలె మిక్కిలి శృంగార రస ప్రధానములతో గంభీరములు అయిన వాక్కులతో సత్పురుషుల హృదయాలను రంజింప చేయు చున్నారు కదా !


🌻. జప విధానం - నైవేద్యం :


ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేసి తేనె, పండ్లు, క్షీరాన్నము నివేదిస్తే, వేదములు - ఉపనిషత్తులు అర్థం చేసుకోగల శక్తి పొందుతారు అని చెప్పబడింది.


🌹Soundarya Lahari -16 🌹

📚. Prasad Bharadwaj 


🌻 Mastery of Vedas and Upanishads 🌻


16. Kavindranam chetah-kamala-vana-baal'atapa-ruchim Bhajante ye santah katichid arunameva bhavatim; Virinchi-preyasyas tarunatara sringara-lahari- Gabhirabhi vagbhir vidadhati satam ranjanamami.


🌻 Translation : 

She who is the purple luster of the dawn, to the lotus forest like mind, of the kings of poets of the world, and thus called aruna-the purple colored one, creates happiness in the mind of the holy, with tender passionate wave of words, [of sarswathi the darling of Brahma,] which are royal and youthful.


🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :


If one chants this verse 1000 times every day for 45 days, and offers Honey, fruits, and payasam as nivedhyam , one is said to be the master Vedas and Upanishads.


🌻 BENEFICIAL RESULTS: 

Erudition, knowledge of Vedas and Shastras, knowledge of various languages and immunity from evil effects of spirits.


🌻 Literal Results:

Winning in debates, enticing public through dynamic oratory, capable of emerging victorious in extremely difficult subjects or higher studies and attaining top grades. Highly suited for people in the field of politics and law.

🌹 🌹 🌹 🌹 🌹

#చైతన్యవిజ్ఞానం #ChaitanyaVijnanam #PrasadBhardwaj

🌹. సౌందర్య లహరి - 15 / Soundarya Lahari - 15 🌹


🌹. సౌందర్య లహరి - 15 / Soundarya Lahari - 15 🌹

📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ


🌻. కవిత్వం - విజ్ఞానంలో అభివృద్ధి చెందుటకు 🌻

 

శ్లో: 15. శరజ్జ్యోత్స్నా శుధ్ధాం - శశియుత జటాజూటమకుటాం 

వరత్రాసత్రాణ స్ఫటికఘటికా పుస్తక కరామ్ 

సకృన్నత్వా న త్వా కథమివ సతాం సన్నిదధతే 

మధుక్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయఃll 

 

🌻. తాత్పర్యముః 

అమ్మా ! శరత్కాలమునందు ఉండు వెన్నెల వలె నిర్మలమయిన శరీరము కల దానవు, పిల్ల జాబిల్లితో కూడిన జడ ముడి ఉన్న కిరీటము కల దానవు, కోరికలు తీర్చు వరముద్ర, భయమును పోగొట్టు అభయముద్ర కల దానవు, స్ఫటిక పూసల జపమాలను, పుస్తకమును చేతుల యందు ధరించిన నిన్ను ఒక్క పరి అయినా నమస్కరించు సజ్జనులకు తేనె, ఆవు పాలు, ద్రాక్ష పండ్ల యొక్క మధురములను అందించు వాక్కులు రాకుండా యెట్లు ఉండును. తప్పక వచ్చును కదా !


🌻. జప విధానం - నైవేద్యం :-

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేసి తేనె, పండ్లు, చక్కెర నివేదిస్తే, కవిత్వములో, విజ్ఞాన శాస్త్రములో నిపుణత్వము పొందుతారు అని చెప్పబడింది.

🌹 🌹 🌹 🌹 🌹 


🌹 Soundarya Lahari - 15 🌹 

📚. Prasad Bharadwaj 


🌻 Ability to Write Poems and ability to Become Scholar 🌻


15. Saraj-jyotsna-shuddham sasi-yuta-jata-juta-makutam Vara-traasa-traana-sphatika-ghutika-pustaka karaam; Sakrn na thva nathva katham iva sathaam sannidadhate Madhu-kshira-drakhsa-madhurima-dhurinah phanitayah.


🌻 Translation :

Sweetest words rivaling the honey, milk and grapes, can only come to the thoughts of the devotee, who once meditates on your face, which is like the white autumn moon, on your head with a crown with the crescent moon and flowing hair, and hands that shower boons and give protection, which hold the crystal chain of beads and books.


🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :


If one chants this verse 1000 times every day for 45 days, and offers Honey, fruits and sugar as nivedhyam , one is said to gain the ability to write poems and become a scholar.


🌻 BENEFICIAL RESULTS: 

Getting poetic imagination and enlightenment. 

 

🌻 Literal Results: 

Attaining wisdom over disturbing issues. Enjoying sweet foods. Creative intellect gets enhanced, elevation in academics. 

🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 14 / Soundarya Lahari - 14 🌹


🌹. సౌందర్య లహరి - 14 / Soundarya Lahari - 14 🌹 

📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ 


🌻. అంటు రోగములు కరవు బారి నుండి రక్షణ 🌻

 

🌻. శ్లో: 14. క్షితౌ షట్పంచాశ- ద్ద్విసమధికపంచాశ దుదకే 

హుతాశే ద్వాషష్టి - శ్చతురధికపంచాశదనిలే 

దివి ద్విష్షట్త్రింశ-న్మనసి చ చతుష్టష్టిరితి యే 

మయూఖా స్తేషామ ప్యుపరి తవ - పాదాంబుజ యుగమ్ 

 

🌻. తాత్పర్యముః 

 అమ్మా ! సాధకుని దేహమందు పృధ్వీ తత్వముతో ఉన్న మూలాధారమునందు ఏబది ఆరును,జల తత్వముతో ఉన్న మణిపూరము నందు ఏబది రెండునూ, అగ్నితత్వమగు స్వాదిస్ఠానమునందు అరువది రెండునూ,వాయుతత్వముతో కూడిన అనాహతమునందుఏబది నాలుగునూ,ఆకాశతత్వమయిన విశుద్ధచక్రమునందు డెబ్బది రెండునూ, మనస్తత్వముతో కూడిన ఆజ్ఞాచక్రమందు అరువది నాలుగున్నూ కిరణములు గలవో వాని పై భాగమున ఉండు సహస్రదళ మధ్యనున్న బైందవ స్థానమున నీ యొక్క పాదముల జంట నర్తించును,  


🌻. జప విధానం - నైవేద్యం:


ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేసి పాలతో చేసిన పాయసమును నివేదిస్తే, లోకములో మహమ్మారిలు గా చెప్పబడిన అంటు రోగములు కలరా, ప్లేగు వంటి బారి నుండి, మరియు కరవు కాటకాల నుండి రక్షింప బడుదురని చెప్పబడింది. 

🌹 🌹 🌹 🌹 🌹 


🌹 Soundarya Lahari -14 🌹

📚. Prasad Bharadwaj 


🌻 Avoiding Famine, Dacoity and Epidemic 🌻


14. Ksitau sat-panchasad dvi-samadhika-panchasadudake Hutase dva-sastis chatur-adhika-panchasad anile; Divi dvih-shatrimsan manasi cha chatuh-sashtir iti ye Mayukhastesham athyupari tava padambuja yugam. 


🌻 Translation : 

Your two holy feet are far above, the fifty six rays of the essence of earth of mooladhara,the fifty two rays of the essence of water of mani pooraka,the sixty two rays of the essence of fire of swadhishtana,the fifty four rays of the essence of air of anahatha,the seventy two rays of the essence of ether of visuddhi,and the sixty four rays of the essence of mind of Agna chakra.


🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :  


If one chants this verse 1000 times every day for 45 days, and offers Milk Payasam as nivedhyam , it is said that we can avoid famine ,dacoity and epidemics.


🌻 BENEFICIAL RESULTS: 

Removes poverty in the case of individuals; freedom from famine, drought, etc. in the case of nations.


🌻 Literal Results: 

In case of deprivation in any area of life/ health/ career of the devotee, that particular issue gains strength , getting rid of bad and untoward factors.

🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 13 / Soundarya Lahari - 13🌹


🌹. సౌందర్య లహరి - 13 / Soundarya Lahari - 13 🌹 

📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ 


🌻. దైవీ ప్రేమ - విశేష భక్తి నందు స్థిరత్వము 🌻

 

శ్లో: 13. నరం వర్షీయాంసం- నయనవిరసం నర్మసు జడం 

తవాపాంగాలోకే - పతితమనుధావంతి శతశఃll 

గళద్వేణీబంధాః - కుచకలశవిస్రస్త సిచయాః 

హఠా త్తృట్యత్కాంచ్యో విగళిత దుకూలా యువతయః 

 

🌻. తాత్పర్యము : 

అమ్మా ! ఏ పురుషుడు ముదుసలి అయి శరీరము ముడుతలు పడి, కళ్ళనిండా పుసులు ఉండి మసక చూపు కలిగి, శృంగార భాషణములు కూడా చేయలేని మూఢుడయిన వాడు అయినా నీ క్రీగంటి చూపులకు పాత్రమయిన వానిని చూచుటకు వందల కొలది మదవతులు తమ జుట్టు ముడులు విడిపోవుచున్ననూ, పయ్యెదలు జారిపోవు చుండగా, బంగారు మొలనూలులు జారిపోవుచుండగా వానిని చూచుటకు పరిగెత్తుకుని వెంట పడుతున్నారు కదా.  


🌻. జప విధానం - నైవేద్యం:


ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 6 రోజులు జపం చేసి త్రిమధురమును లేదా అన్నమును నివేదిస్తే, లోతైన సత్య ప్రేమ యందు, విశేష భక్తి నందు స్థిర పడుదరని చెప్పబడింది. 


🌹 Soundarya Lahari - 13 🌹

📚. Prasad Bharadwaj


🌻. Victory in the matters of Love and devotion. 🌻


13. Naram varshiyamsam nayana virasam narmasu jadam, Thava panga loke pathitha manudhavanthi sathasa Gala dweni bhandha kuch kalasa visthrutha sichaya Hatath thrudyath kanchyho vigalidha dhukoola yuva thaya. 


🌻 Translation : 

With disheveled hair, with upper cloths slipping from their busts, with the lock of the golden belt getting open due to the haste, and with saris slipping away from their shoulders, hundreds of young lasses, run after the men, who get your sidelong glance, even though they are very old, bad looking and not interested in love sports. 


🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :  


If one chants this verse 1000 times every day for 6 days, and offers Trimadhuram or rice as nivedhyam ,it is said that one can attain victory in divine love and Devotion. 


🌻 BENEFICIAL RESULTS :

Power to attract women and cures impotency.


🌻 Literal Results : 

Ability to magnetise women. Increase of virility in men.

🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 12 / Soundarya Lahari - 12 🌹


🌹. సౌందర్య లహరి - 12 / Soundarya Lahari - 12 🌹 

📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ


🌻. పరమ శివుని ప్రాప్తి - కవితా నైపుణ్యం 🌻


🌻. శ్లో: 12. త్వదీయం సౌదర్యం- తుహినగిరి కన్యే! తులయితుం 

కవీంద్రాః కల్పంతే- కథ మపి విరించి ప్రభృతయఃl 

యదాలోకౌత్సుక్యా - దమరలలనా యాంతి మనసా 

తపోభిర్దుష్ప్రాపా-మపిగిరిశ సాయుజ్యపదవీమ్ll 

 

తాత్పర్యము : 

ఓహిమవత్పర్వత రాజ తనయా ! నీ సౌందర్యమును పోల్చుటకు బ్రహ్మదేవుడు మొదలయిన కవి పుంగవులు కూడా సమర్ధులు కాకుండిరి. ఎందువలన అనగా సృష్టి లోని సౌందర్య రాశులు అయిన అప్సరసలు కూడా నీ అందమునకు ఆశ్చర్యము పొంది, తాము నీతో సరిపోలము అని మనస్సులో శివునితో ఐక్యము కోరుతున్నారుట. 


🌻. జప విధానం - నైవేద్యం:


ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేసి తేనెను నివేదిస్తే, పరమశివ ప్రాప్తి, కవిత్వ సామర్ధ్యము, దాని వలన కీర్తి ప్రతిష్ఠలు వచ్చును అని చెప్పబడింది. 

🌹 🌹 🌹 🌹 🌹 


🌹 Soundarya Lahari - 12 🌹

📚. Prasad Bharadwaj 


🌻 To attain Lord Shiva and to become Poetic Person 🌻


12. Tvadiyam saundaryam Tuhina-giri-kanye tulayitum Kavindrah kalpante katham api Virinchi-prabhrutayah; Yadaloka'utsukyad amara-lalana yanti manasa Tapobhir dus-prapam api girisa-sayujya-padavim.


🌻 Translation : 

Oh, daughter of Ice Mountain, even the creator who leads, an array of great poets, fails to describe your sublime beauty. The heavenly maidens pretty, with a wish to see your pristine loveliness, try to see you through the eyes your lord, the great Shiva, and do penance to him and reach him through their mind.


🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :


If one chants this verse 1000 times every day for 45 days, and offers honey as nivedhyam , it is said to be believed that one becomes very Poetic and also can attain Lord Mahadheva.


🌻 BENEFICIAL RESULTS: 

Cures dumbness, provides power of eloquent speech, gift of poesy.


🌻 Literal Results: 

Improves intellect and analytical capacity. Poetic and scholarly pursuits are enhanced. Concentration and capacity to focus increases.

🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 11 / Soundarya Lahari - 11 🌹


🌹. సౌందర్య లహరి - 11 / Soundarya Lahari - 11 🌹 

📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ


🍃. సంతానము కోసం 🌹


🌻. శ్లో: 11. చతుర్భిః శ్రీకంఠైః - శివయువతిభిః పంచభిరపి 

ప్రభిన్నాభిః శంభో - ర్నవభి రపి మూలప్రకృతిభిఃl 

చతుశ్చత్వారింశ- ద్వశుదళ కళాశ్ర త్రివలయ 

త్రిరేఖాభిః సార్ధం - తవ శరణకోణాః పరిణతాః ll 

 

 🌻. తాత్పర్యము : 

అమ్మా ఈశ్వరీ ~ శ్రీచక్రం~ నాలుగు శివచక్రాలు, వాటి‌నుండి విడివడిన ఐదు‌ శక్తి చక్రాలతో ఉన్నది. ప్రపంచానికి మూలకారణమైన తత్త్వముతో కూడిన నీ నివాసమైన శ్రీచక్రంలోని కోణాలు~ అష్టదళాలు~ షోడశదళ పద్మాలు~ మేఖలాతంత్రంగా మూడు భూపురాలు కలిసి నలభైనాలుగు అంచులు కలిగి‌ వున్నాయి.‌ 


బాష్యము :

బిందు~త్రికోణ~ వసుకోణ~ దశారయుగ్మ~ మన్వస్ర~ నాగ దళ షోడస పత్ర యుక్తంచ~ ధరణీ సదనత్రయంచ~ శ్రీచక్ర రాజ ఉదితః పరదేవతాయాః అను నీ నివాసమగు శ్రీచక్ర వర్ణనలో అత్యంత శోభాయమానముగా అత్యంత సౌష్టవరీతిలో బ్రహ్మాడ~పిండాండ, సృష్టి~ప్రళయ విజ్ఞాన సమస్త రహస్యములను సంకేత పూర్వకముగా పొందుపరచబడిన యంత్ర రాజమే శ్రీచక్రము. అన్ని తంత్రములకు~ అన్ని‌ యంత్రములకు ~ అన్ని‌ మంత్రములకు దీని యందు సమన్వయము దొరుకును. అందుచేతనే దీనిని యంత్ర రాజము~ శ్రీచక్రరాజము అని అందురు. అటువంటి శ్రీచక్ర స్వరూపమైన మీఇరువురికీ నా నమస్సులు తల్లీ!!! 


🌻. జప విధానం - నైవేద్యం :


ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 40 రోజులు జపం చేసి బూరెలు, వెన్న నివేదిస్తే, మంచి ప్రయోజనకరమైన, వంశ ప్రతిష్ఠ ను నిలిపే సంతానము కలుగును.


🌹 Soundarya Lahari - 11 🌹

📚. Prasad Bharadwaj 


🌻. Good Progeny, Getting a Meaning for Life 🌻


🌻. Sloka :

Chaturbhih shri-kantaih shiva-yuvatibhih panchabhir api Prabhinnabhih sambhor navabhir api mula-prakrthibhih; Chatus-chatvarimsad vasu-dala-kalasra-trivalaya- Tri-rekhabhih sardham tava sarana-konah parinatah


🌻. Translation : 

With four wheels of our lord Shiva ,and with five different wheels of you, my mother, which are the real basis of this world, your house of the holy wheel, has four different parts of eight and sixteen petals, three different circles, and three different lines, making a total of forty four angles.

                                                                                  

🌻. Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :


If one chants this verse 1000 times every day for 40 days, and offers butter and Boorelu as nivedhyam , one is said to be blessed with a lovely male baby to represent their family ‘s riches and name.


🌻 BENEFICIAL RESULTS: 

Barren women become pregnant, getting issues. The butter used for drawing Yantra to be consumed daily.


🌻 Literal Results: 

Intricate problems being solved.

🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 10 / Soundarya Lahari - 10 🌹


🌹. సౌందర్య లహరి - 10 / Soundarya Lahari - 10 🌹 

📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ


🌴 . . బలమైన భౌతిక శరీరము - మనో ధారుఢ్యము - ఆరోగ్యం 🌴

 

🌻. శ్లో ll 10. సుధాధారాసారై - శ్చరణయుగళాంతర్వి గళితైః 

ప్రపంచం సించన్తీ - పునరపి రసామ్నాయమహసా 

అవాప్య త్వాం భూమిం - భుజగనిభ మధ్యుష్టవలయం

స్వమాత్మానం కృత్వా - స్వపిషి కులకుండే కుహరిణి ll

 

🌻. తాత్పర్యముః 

 అమ్మా ! పాద పద్మముల మధ్యనుండి ప్రవహించిన అమృత ధారా వర్షముతో డెబ్బది రెండు వేల నాడుల ప్రపంచమును తడుపుతూ తిరిగి అమ్రుతాతిశయము గల చంద్రుని కాంతి కలిగి మరల మూలాధార చక్రమును చేరి స్వస్వరూపమయిన సర్ప రూపముతో చుట్టలుగా చుట్టుకొని కుండలినీ శక్తివయి నిద్రించు చున్నావు.


🌻. జప విధానం - నైవేద్యం:-

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 6 రోజులు జపం చేసి పండ్లు నివేదిస్తే, బలమైన భౌతిక శరీరము, దృఢమైన మనస్సు, మంచి ఆరోగ్యము ప్రసాదించబడును అని చెప్పబడింది.

🌹 🌹 🌹 🌹 🌹 


🌹 Soundarya Lahari - 10 🌹

📚. Prasad Bharadwaj 


🌻 Getting Strong Body and Virility 🌻


10. Sudha-dhara-sarais carana-yugalanta vigalitaih Prapancham sinchanti punarapi ras'amnaya-mahasah; Avapya svam bhumim bhujaga-nibham adhyusta-valayam Svam atmanam krtva svapishi kulakunde kuharini


🌻 Translation : 

Using the nectar that flows in between your feet, to drench all the nerves of the body, and descending from the moon with nectar like rays, reaching back to your place, and coiling your body in to a ring like serpant, you sleep in the kula kunda with a hole in the middle another name for mooladhara chakra.


🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :


If one chants this verse 1000 times every day for 6 days, and offers fruits as nivedhyam , one is said to be blessed with a strong and good health.


🌻 BENEFICIAL RESULTS: 

Purification of body frame. Cures watery diseases. In case of women, develops breasts and enables proper menstruation. 

 

🌻 Literal Results: 

This sloka invokes Reiki energy. The Supreme Mother Goddess, who is the life-energy force enters the body through the moolaadhaara chakra to raise up,activating chakras and purifying the entire body frame. For people who are suffering from depression, lack of energy and anaemia, this sloka induces divine energy to rejuvenate the devotee as though he/she has taken a new life. 


Offering and consuming of a quarter glass of milk with 20 raisins and 10 sugar-candies are mandatory to avoid feverish feeling with body aches. 

🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 9 / Soundarya Lahari - 9🌹


🌹. సౌందర్య లహరి - 9 / Soundarya Lahari - 9 🌹 

📚. సంకలనము : ప్రసాద్ భరద్వాజ 


🌴. దూర ప్రయాణంలో ఉన్న వ్యక్తుల రక్షణ, తప్పిపోయిన వారిని వెనుకకు రప్పించుట మరియు పంచ భూతముల మీద ఆధిపత్యం, సర్వ సంపదలు 🌴

 

శ్లో ll 9. మహీం మూలాధారే - కమపి మణిపూరే హుతవహం 

స్థితం స్వాధిష్టానే - హృది మరుత మాకాశ ముపరిl 

మనోపి భ్రూమధ్యే - సకలమపి భిత్వా కులపథం

సహస్రారే పద్మే - సహ రహసి పత్యా విహరసేll 

 

🌻. తాత్పర్యముః 

అమ్మా ! పృథ్వి తత్వముగా మూలాధార చక్రమున, జల తత్వమున మణిపూర చక్రమున,అగ్ని తత్వమున స్వాధిష్టానమున,వాయు తత్వముతో అనాహత చక్రమున, ఆకాశ తత్వముగా విశుద్ద చక్రమున,ఆజ్ఞా చక్రమున మనస్తత్వము గా ఉండి ఆ పైన సుషుమ్నా మార్గము గుండా సహస్రారము చేరి పతి యగు పరమేశ్వరునితో కలసి విహరించు చున్నావు. 


🌻. జప విధానం - నైవేద్యం:-

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేసి పాలతో చేసిన పాయసం, నివేదిస్తే, దూర ప్రయాణంలో ఉన్న వ్యక్తులకు రక్షణ, వెనుకకు రప్పించుట, తప్పిపోయిన వారు లభించుట మరియు పంచ భూతముల మీద ఆధిపత్యం, సర్వ సంపదలు లభించుట జరుగునని చెప్పబడింది.

🌹 🌹 🌹 🌹 🌹 


🌹 Soundarya Lahari - 09 🌹

📚. Prasad Bharadwaj 


🌴 For Safe Return of lost Persons and who are on Journey and For Getting control over nature, all wealth 🌴


🌻. Mahim muladhare kamapi manipure huthavaham Sthitham svadhistane hridi marutamakasam upari; Mano'pi bhruu-madhye sakalamapi bhittva kula-patham Sahasrare padme saha rahasi patyaa viharase.


🌻 Translation : 

Oh goddess mine, you live in seclusion with your consort, in the lotus with thousand petals, reached after breaking through the micro ways, of the power of earth mooladhara,of the power of water of mani poora, of the power of fire of swadhishtana, of the fire of air in the heart, and of the power of ether in between the eyelids.


🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :

If one chants this verse 1000 times every day for 45 days, and offers Milk Payasam and to the Lord as nivedhyam , it is said to believe that it is to bring back the person who is lost or who is on a long journey and to get all types wealth - control over nature.


🌻 BENEFICIAL RESULTS: 

Return of persons long absent, mastery over elements. 

 

🌻 Literal Results: 

Balancing and activation of chakras. Balancing of the elements in the body and treament of ailments related to elements. Good understanding with spouse. 

🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 8 / Soundarya Lahari - 8 🌹


🌹. సౌందర్య లహరి - 8 / Soundarya Lahari - 8 🌹 

📚. ప్రసాద్ భరద్వాజ 


🌴. పుట్టుక మరియు మరణాన్ని పరిహరించుట 🌴

 

🌻. శ్లో ll 8. సుధాసింధో ర్మధ్యే - సురవిటపివాటీ పరివృతే 

మణిద్వీపే నీపో - పవనవతి చింతామణి గృహేl 

శివాకారే మంచే - పరమశివపర్యంకనిలయామ్ 

భజంతి త్వాం ధన్యాః - కతిచన చిదానందలహరీమ్ll 

 

🌻. తాత్పర్యముః 

అమ్మా ! అమృత సముద్రము మధ్య భాగమున ఉన్న రతనాల దీవి యందు కల్ప వృక్షములు, కదంబ పూతోట లోపల చింతామణులతో నిర్మిచబడిన గృహము నందు శివుని రూపముగా గల మంచమున పరమ శివుని తొడయే స్థానముగా గల జ్ఞానానంద ప్రవాహ రూపిణియగు నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవించు చున్నారు. 


🌻. జప విధానం - నైవేద్యం:

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 12 రోజులు జపం చేసి పాయసం, అన్నం అమ్మకు నివేదిస్తే, జనన మరణాల నుండి తప్పించబడతారు అని చెప్పబడింది.

🌹 🌹 🌹 🌹 🌹 


🌹 Soundarya Lahari - 8 🌹

📚. Prasad Bharadwaj 


🌴 Avoiding Birth and Death 🌴


🌻 Sloka 8 : 

Sudha-sindhor madhye sura-vitapi-vati parivrte Mani-dweepe nipo'pavana-vathi chintamani-grhe; Shivaakare manche Parama-Shiva-paryanka-nilayam Bhajanti tvam dhanyah katichana chid-ananda-laharim.


🌻 Translation :

In the middle of the sea of nectar, in the isle of precious gems,which is surrounded by wish giving kalpataru trees, in the garden kadamba trees, in the house of the gem of thought, on the all holy seat of the lap of the great god Shiva, sits she who is like a tide In the sea of happiness of ultimate truth, and is worshipped by only by feselect holy men.


🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :

If one chants this verse 1000 times every day for 12 days, and offers Payasam and rice to the Lord as prasadham, it is said to be believed that one can avoid birth and death.


🌻 BENEFICIAL RESULTS: 

Release from all kinds of bondages, imprisonment and debt, fulfillment of all desires. 

 

🌻 Literal Results: 

Luxuries, viewing everything and everybody with a sense of happiness/ or change of residence to a better place/ or a long stay in a beautiful spiritual or holiday retreat. 

🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 7 / Soundarya Lahari - 7 🌹


🌹. సౌందర్య లహరి - 7 / Soundarya Lahari - 7 🌹 

📚. ప్రసాద్ భరద్వాజ 


🌴. సర్వుల యందు అమ్మ దర్శనము, సర్వ శత్రు విజయం 🌴

 

శ్లో ll 7. క్వణత్కాంచీదామా - కరికలభకుంభస్తననతా 

పరీక్షీణా మధ్యే - పరిణత శరచ్చంద్రవదనాl 

ధను ర్బాణాన్ పాశం - సృణి మపి దధానా కరతలైః 

పురస్తా దాస్తాం నః - పురమథితురాహోపురుషికాll 

 

🌻. తాత్పర్యముః 

మిల మిల మెరయుచున్న మణుల గజ్జెల మొలనూలు కలిగిన,గున్న ఏనుగు కుంభముల వంటి కుచముల భారము వలన వంగిన నడుము ఉన్నట్లు కనపడుతున్నదియు, సన్నని నడుము కలిగి, శరత్కాల చంద్రుని వంటి ముఖము కలదియు, చెరకుగడ విల్లునూ, పూవుటమ్మును, అంకుశమును, పాశమును ధరించు చున్న అహంకార రూపు కలిగిన దేవి మా ఎదుట నిలుచు గాక. 


🌻. జప విధానం - నైవేద్యం :

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 12 రోజులు జపం చేసి పాయసం, అన్నం అమ్మకు నివేదిస్తే, సర్వుల యందు అమ్మ దర్శనము, సర్వ శత్రు విజయం కలుగుతుంది అని చెప్పబడింది.

🌹 🌹 🌹 🌹 🌹 


🌹 Soundarya Lahari - 7 🌹

📚. Prasad Bharadwaj 


🌴. Seeing the Goddess in person, Winning over enemies 🌴


Sloka 7 : 

Kvanat-kanchi-dama kari-kalabha-kumbha-stana-nata Pariksheena madhye parinata-sarachandra-vadana; Dhanur banan pasam srinim api dadhana karatalaii Purastad astam noh Pura-mathitur aho-purushika.


🌻 Translation : 

With a golden belt, adorned by tiny tingling bells, slightly bent by breasts like the two frontal globes of an elephant fine, with a thin pretty form, and with a face like the autumn moon, holding in her hands, a bow of sugar cane, arrows made of flowers, and the noose and goad, she who has the wonderful form, of the ego of the god who burnt the three cities, should please come and appear before us.


🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :

If one chants this verse 1000 times every day for 12 days, and offers Payasam and rice to the Lord as prasadham, it is said to be believed that one can see the lord in person and win over all the enemies.


🌻 BENEFICIAL RESULTS : 

Fascinating even royal personages and over-coming enemies. 

 

🌻 Literal Results: 

This sloka will directly link the devotee to the Supreme Goddess of Kanchipuram, Kamakshi. She is the dominant One "Purushika" and She literally takes over the devotee and gives her/ him a delicious taste of Her "saannidhyam". Messages, events related to Kanchi Kamakshi will fill the life of the devotee and she/ he is constantly in a state of bliss just thinking about Her. People with Rahu-related problems can overcome difficulties by chanting this sloka. 

🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 6 / Soundarya Lahari - 6 🌹


🌹. సౌందర్య లహరి - 6 / Soundarya Lahari - 6 🌹 

📚. ప్రసాద్ భరద్వాజ 


🌴. పుత్ర సంతతి వంశ వృద్ధి 🌴

 

🌷. శ్లోll 6. ధనుఃపౌష్పం మౌర్వీ మధుకర మయీ పంచ విశిఖాః 

వసంన్తః సామంతో మలయ మరు దాయోధనరథః 

తథాప్యేకః సర్వం హిమగిరి సుతే కామాపి కృపా 

మపాంగాత్తేలబ్ధ్వా- జగదిద మనంగో విజయతేll 

 

🌷. తాత్పర్యం : 

అమ్మా ! హిమవత్పర్వత రాజ పుత్రీ , పూవులతో కూడిన విల్లు, తుమ్మెదల తో చేయబడిన నారి, అయిదు బాణములు, జడత్వము కలవాడునూ,మలయ మారుతమే యుద్ధ రధముగా గల మన్మధుడు సైతము నీ కడగంటి చూపు వలన ఈ జగత్తునే జయించు చున్నాడు కదా ! 


🌻. జప విధానం - నైవేద్యం:-

ఈ శ్లోకమును 500 సార్లు ప్రతి రోజు 21 రోజులు జపం చేసి చెరకును అమ్మకు నివేదిస్తే, వంశవృద్ధికి, సంపదను కాపాడే పుత్రు సంతానం కలుగుతుంది అని చెప్పబడింది.

🌹 🌹 🌹 🌹 🌹 


🌹 Soundarya Lahari - 6 🌹

📚. Prasad Bharadwaj 


🌴. Getting Sons as Progeny 🌴


🌻 Sloka 6 :

Dhanun paushpam maurvi madhu-kara-mayi pancha visikha Vasantaha samanto Malaya-marud ayodhana-rathah; Tatha'py ekah sarvam Himagiri-suthe kam api kripaam Apangat te labdhva jagadidam Anango vijayate


🌻 Translation : 

Oh, daughter of the mountain of ice, with a bow made of flowers, bow string made of honey bees, five arrows made of only tender flowers, with spring as his minister, and riding on the chariot of breeze from Malaya mountains the god of love who does not have a body, gets the sideways glance of your holy eyes, and is able to win all the world alone.


🌻 Chanting procedure and Nivedyam ( offerings to the Lord) :

If one chants this verse 500 times every day for 21 days, and offer Sugarcane to the Lord as prasadham, one is said to be blessed with a son to protect the riches of the family.


🌻 BENEFICIAL RESULTS: 

Cures impotency, bestows children. 

 

🌻 Literal Results: 

For people who require a favour from superiors at work. For anybody with limited resources who intend to start any enterprise/who have to work against odds etc. The "jagadidmanango vijayathe" is a powerful implication in this sloka , bestowing all round success and patronage from higher-ups. This also bestows ability to emerge victorious in competitions. 

🌹 🌹 🌹 🌹 🌹

Sunday, July 7, 2019

🌹. సౌందర్య లహరి - 5 / Soundarya Lahari - 5 🌹


🌹. సౌందర్య లహరి - 5 / Soundarya Lahari - 5 🌹

📚. ప్రసాద్ భరద్వాజ 


🌴. పరస్పర ఆకర్షణ - సహకారము 🌴

 

🌷. శ్లోll 5.హరి స్త్వా మారాధ్య ప్రణత జనసౌభాగ్య జననీం 

         పురా నారీ భూత్వా పురరిపు మపి క్షోభ మనయత్ 

        స్మరో పి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా* 

        మునీనా మప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ll 

 

🌷. తాత్పర్యం :  

అమ్మా ! లోకములకు సౌభాగ్య ప్రదురాలవు అయిన నీ అభయము వలన విష్ణుమూర్తి స్త్రీ అవతారము ఎత్తి పరమ శివుని కూడా ప్రభావితము చేసెను కదా , అటులనే మన్మధుడు కూడా నిన్ను పూజించి రతీదేవికి ఇష్ట సఖుడే కాక మునుల మనస్సులు కూడా మోహ పెట్టుటకు సరి అయిన వ్యక్తి అయినాడు కదా ! 


🌻. జప విధానం - నైవేద్యం:-

ఈ శ్లోకమును 2000 సార్లు ప్రతి రోజు 8 రోజులు జపం చేసి పొంగల్ (పప్పుతో కలిపి వండిన అన్నం) అమ్మకు నివేదిస్తే, స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ, సహకారము పెంపొంది తద్వారా ప్రేమ అనుభూతమవుతుంది అని చెప్పబడింది.

🌹 🌹 🌹 🌹 🌹 


🌹. Soundarya Lahari - 5 🌹

📚. Prasad Bharadwaj 


🌴 Attracting of Sexes to Each Other 🌴

 

🌻 Sloka 5 : 

Haris tvam aradhya pranata-jana-saubhagya-jananim Pura nari bhutva Pura-ripum api ksobham anayat; Smaro'pi tvam natva rati-nayana-lehyena vapusha Muninam apyantah prabhavati hi mohaya mahatam.


🌻 Translation : 

You who grant all the good things, to those who bow at your feet, was worshiped by the lord Vishnu, who took the pretty lovable feminine form, and could move the mind of he who burnt the cities, and make him fall in love with him. And the god of love, manmatha, took the form which is like nectar, drunk by the eyes by rathi his wife, after venerating you, was able to create passion, even in the mind of sages the great.


🌻 Chanting procedure and Nivedyam ( offerings to the Lord) :

If one chants this verse 2000 times every day for 8 days, and cook Pongal (made from dhal) as nivedhyam, it is said that one can attract the other sex and make love out of it.


🌻 BENEFICIAL RESULTS: 

Power to fascinate men and women, entice people. 

 

🌻 Literal Results: "Sowbhagyam" (contentment in all areas of life -a quality applicable to men and women) is the result, apart from the ability to develop a magnetic personality at work, social gatherings or at home. The devotee has the capacity to charm anybody he/she meets or contacts. 

🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 4 / Soundarya Lahari - 4 🌹


🌹. సౌందర్య లహరి - 4 / Soundarya Lahari - 4 🌹 

📚. ప్రసాద్ భరద్వాజ 


🌴. అన్ని భయాలు తొలగించడం మరియు వ్యాధుల తగ్గింపు 🌴 


🌷. శ్లోll 4 త్వదన్యః పాణిభ్యా-మభయవరదో దైవతగణ  

         స్త్వమేకా నైవాసి-ప్రకటితవరాభీత్యభినయా  

         భయాత్త్రాతుం దాతుం-ఫలమపి చ వాంఛాసమధికం  

         శరణ్యే లోకానాం-తవ హి చరణావేవ నిపుణౌll  


🌷. తాత్పర్యం : 

అమ్మా ! లోకములకు దిక్కు అయిన తల్లీ మిగిలిన దేవతలు అందరూ అభయ ముద్రలను కలిగి ఉన్నారు , అందరు దేవతలకు ముఖ్యమయిన నీవు మాత్రము వరాభయ గుర్తులు అయిన ప్రకటిత ముద్రల అభినయము కల దానవు. అయితే నీ పాదములే, కోరక ముందే కోరికలు తీర్చి భయములు పోగొట్టును కదా ! 


🌻. జప విధానం - నైవేద్యం:-

ఈ శ్లోకమును 3000 సార్లు ప్రతి రోజు 36 రోజులు జపం చేసి నిమ్మ పులిహోర అమ్మకు నివేదిస్తే, అన్ని భయాలు తొలగించి అన్ని రకాల వ్యాధులకు పరిష్కారాలను ఇస్తుంది అని చెప్పబడింది.


🌹 Soundarya Lahari - 4 🌹

📚. Prasad Bharadwaj 


🌴. Removal of all Fears and Curing of Diseases 🌴


🌻 Sloka 4 :  

Tvad anyah paanibhyam abhaya-varado daivataganah Tvam eka n'aivasi prakatita-var'abhityabhinaya; Bhayat tratum datum phalam api cha vancha samadhikam Saranye lokanam tava hi charanaveva nipunav.


🌻 Translation : 

Oh, she who is refuge to all this world, all gods except you mother, give refuge and grants wishes, but only you mother never show the world in detail, the boons and refuge that you can give, for even your holy feet will suffice, to remove fear for ever, and grant boons much more than asked.


🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :

If one chants this verse 3000 times every day for 36 days, and offers lemon rice as nivedhyam,it is said that all the fears are removed and gives solutions for all types of diseases.


🌻 BENEFICIAL RESULTS:

Cures diseases, grants freedom from fear and poverty; enables possessions of vast estates. 

 

🌻 Literal Results: 

To meditate on the feet of the Goddess while reciting sloka. Suited for dancers and instrumentalists, as the focus is on hands and feet.More benefits are derived apart from attaining desired benefit. Atleast 11 times a day. 

🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 3 / Soundarya Lahari - 3🌹


🌹. సౌందర్య లహరి - 3 / Soundarya Lahari - 3 🌹 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. సమస్త జ్ఞాన సముపార్జన 🌴
  
🌻. శ్లోII 3. అవిద్యానా మంత స్తిమిరమిహిరద్వీపనగరీl  
          జడానాం చైతన్య స్తబకమకరందస్రుతిఝరీl  
          దరిద్రాణాం చింతా మణిగుణనికా జన్మజలధౌ  
         నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతిll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా !నీ చరణ పద్మ రేణువు అజ్ఞానము అను చీకటితో ఉన్న వానికి సూర్యోదయము జరుగు పట్టణము వంటిది, మంద బుద్ధులకు చైతన్యము అను పుష్పముల నుండి వెలువడిన మధుర ధార వంటిది,దరిద్రముతో ఉన్న వానికి చింతామణుల హారము వంటిదియు, సంసార సముద్రమున మునిగిన వానికి వరాహావతారము అగు విష్ణు మూర్తి యొక్క కోర వంటిది కదా !

🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును ప్రతి రోజు 45 రోజుల పాటు 2000 సార్లు చేసి, నైవేద్యంగా వడ ప్రసాదంగా సమర్పించిన, జ్ఞాన, విజ్ఞానాలు ప్రసాదించబడును అని చెప్పబడింది. 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹. Soundarya Lahari - 3 🌹
📚. Prasad Bharadwaj 

🌴 Attainment of all Knowledge 🌴

🌻 Sloka 3 :
Avidyanam antas-timira-mihira-dweeppa-nagari Jadanam chaitanya-stabaka-makaranda-sruti jhari Daridranam cinta-mani-gunanika janma-jaladhau Nimadhanam damshtra mura-ripu-varahasya bhavati.

🌻 Translation : 
The dust under your feet, oh goddess great, is like the city of the rising sun, that removes all darkness, unfortunate, from the mind of the poor ignorant one, is like the honey that flows, from the flower bunch of vital action, to the slow witted one, is like the heap of wish giving gems, to the poorest of men, and is like the teeth of lord Vishnu in the form of Varaha, who brought to surface, the mother earth, to those drowned in this sea of birth.

🌻 Chanting procedure and Nivedyam( offerings to the Lord) :
If one chants this verse 2000 times every day for 45 days, and offers Vada (made out of Urad Dhal ) as prasadam,one is said to attain knowledge and wisdom. 

🌻. BENEFICIAL RESULTS:
Attainment of versatile knowledge, particularly of Vedas. 
 
🌻 Literal Results: 
This sloka is a remedy for people who are weak in grasping and memory power. Extremely helpful in enhancing performance levels in academics. Atleast a recitation of 11 times a day will bring remarkable changes in a dull student. It is also important to note that the key objects mentioned in all slokas would bear fruit. In this particular sloka, the mention of gems and necklace would yield results as sloka attains power through chanting.This is also a prayer to one of the Dasavatharas of Lord Vishnu,the Varaha Avathaara! 
🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 2 / Soundarya Lahari - 2 🌹


🌹. సౌందర్య లహరి - 2 / Soundarya Lahari - 2 🌹 

📚. ప్రసాద్ భరద్వాజ 


🌴 . ప్రపంచమును ఆకర్షించే శక్తి 🌴

 

  🌻. శ్లో II 2. తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవం 

           విరించిః సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్I 

           వాహ త్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం 

    హరః సంక్షుద్య్తెనం భజతి బసితోద్ధూళన విధిమ్II 

 

🌻. తాత్పర్యం :   

అమ్మా ! బ్రహ్మ దేవుడు నీయొక్క పాదములందు కలిగి ఉన్న అణుమాత్రము అయిన ధూళినే గ్రహించి సకల లోకములను సృష్టి చేయుచున్నాడు, ఆ సూక్ష్మ కణమునే సహస్ర శిరములతో విష్ణు మూర్తి అతి కష్టముగా మోయు చున్నాడు,శివుడు దానినే భస్మము చేయుచూ భస్మధారణము చేయుచున్నాడు కదా ! 


 🌻. జప విధానం - నైవేద్యం

ఈ శ్లోకమును రోజుకు 1000 సార్లు చొప్పున 55 రోజుల పాటు జపించి, వండిన పాయసమును భగవంతునికి నైవేద్యం గా సమర్పించిన యెడల చేసిన వారు ప్రపంచాన్ని ఆకర్షించే మరియు అధిపతి సామర్ధ్యం పొందగలరు. 

🌹 🌹 🌹 🌹 🌹 


🌹. Soundarya Lahari - 2 🌹 

📚. Prasad Bharadwaj 


🌴 Attracting all the World 🌴


🌻 Sloka 2 :

Taniyamsam pamsum tava carana-pankeruha-bhavam Virincih sanchinvan virachayati lokan avikalam; Vahaty evam Shaurih katham api sahasrena shirasaam Harah samksudy'ainam bhajati bhajati bhasito'ddhalama-vidhim.


🌻 Translation : 

On his Lord Brahma, the creator of yore, selects a dust from your feet,and creates this world,the great Adisesha with his thousand heads,some how carries dust of your feet, with effort great, and the great lord rudra, takes it and powders it nice, and uses it as the holy ash. The thousand headed serpent who carries the worlds head.


🌻 Chanting procedure and Nivedyam ( offerings to the Lord) :-

If one chants this verse 1000 times every day for 55 days, and offers Milk Payasam as prasadam, one is said to gain the ability to attract and head the world. 


🌻 BENEFICIAL RESULTS: 

Gaining vast influence over others and fascination of those around. 

 

🌻 Literal Results: 

To meditate on the feet of the Goddess. Mitigates evil influence of Rahu ( evil placement of Rahu in the horoscope and during Rahu Maha dasa), useful for devotees whose moon is in the constellation of Ardra, Swathi and Satabhisham. Atleast 11 times chanting everyday is recommended to attain prescribed results. 

🌹 🌹 🌹 🌹 🌹

Thursday, July 4, 2019

🌹 సౌందర్య లహరి - 1 / Soundarya Lahari - 1 🌹



🌹. సౌందర్య లహరి / Soundarya Lahari - 1 🌹 
✍️. శ్రీ ఆదిశంకరాచార్యులు
📚. ప్రసాద్ భరద్వాజ 
   
🌷. శ్లోII 1. శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం 
           న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి I 
           అత స్త్వామారాధ్యాం హరి హర విరించాదిభిరపి 
           ప్రణంతుం స్తోతుం వా కధ మక్రుతపుణ్యః ప్రభవతిII 
 
🌻. తాత్పర్యం : అమ్మా నీ శక్తితో కూడినప్పుడే పరమ శివుడు అధినాయకుడు అగుచున్నాడు, అట్లు కాని నాడు ఆ దేవ దేవుడు సమర్ధుడు కాదు. అందువలననే హరి హర బ్రహ్మాదులచే పొగడబడుచున్న నిన్ను పూజించుటకు గానీ పొగడుటకు గానీ పుణ్యము చేయనివాడు ఎట్లు సమర్ధుడు అగును. 

🌻. జప విధానం - నైవేద్యం :
ఈ శ్లోకమును రోజుకు 1000 సార్లు చొప్పున 12 రోజుల పాటు జపించి, వండిన అన్నమును (హవిస్సు) భగవంతునికి నైవేద్యం గా సమర్పించిన యెడల వారి జీవితంలో వున్న అవరోధాలు అన్ని తొలిగి, తమ యొక్క ప్రతి ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు. పోయిన ఆనందాన్ని తిరిగి పొందుతారు అని చెప్పబడింది. 

🌹. Soundarya Lahari - 1 🌹 
✍️. Sri Adi Shankaracharya
📚. Prasad Bharadwaj 

🍃 Ananda Lahari [Waves of Happiness] 🍃

🌻 SLOKA 1 :
Shivah shakthya yukto yadi bhavati shaktah prabhavitum Na chedevam devo na khalu kusalah spanditumapi; Atas tvam aradhyam Hari-Hara-Virinchadibhir api Pranantum stotum vaa katham akrta-punyah prabhavati

🌻 Translation : 
Lord Shiva, only becomes able to do creation in this world along with Shakthi without her Even an inch he cannot move and so how can, one who does not do good deeds, or one who does not sing your praise, become adequate to worship you oh, goddess mine, who is worshipped by the trinity.

🌴 Chanting procedure and Nivedyam ( offerings to the Lord) :

If one chants this verse 1000 times every day for 12 days, and offers cooked raw rice (Havis) as prasadam, one would succeed in all ventures and all obstacles would be removed and restore happiness. 

🌻 BENEFICIAL RESULTS:
All prosperity, granting of cherished purposes and solution to intricate problems. 
 
🌻 Literal results:
The yin and yang factor (feminine and masculine factor) is balanced. Treats hormonal imbalance. Female devotees facing severe marital problems will be able to bring issues under their control/ curb abusive tendencies in husband.If living in a joint family, there will be harmony between female devotee and in laws.This sloka could help females even in work atmosphere, in gatherings etc.Atleast 11 times chanting is a must everyday. 
🌹 🌹 🌹 🌹 🌹

𝐏𝐎𝐖𝐄𝐑 𝐎𝐅 𝐄𝐀𝐂𝐇 𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀 𝐋𝐀𝐇𝐀𝐑𝐈 𝐒𝐇𝐋𝐎𝐊𝐀 - 00

🌹.   𝐏𝐎𝐖𝐄𝐑  𝐎𝐅  𝐄𝐀𝐂𝐇  𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀  𝐋𝐀𝐇𝐀𝐑𝐈  𝐒𝐇𝐋𝐎𝐊𝐀   🌹 📚.  Prasad Bharadwaj 1. Winning in every field 2. Att...