Sunday, August 23, 2020

సౌందర్య లహరి - 82 / ŚŐÚŃĎĂŔŶĂ ĹĂĤĂŔĨ - 82


🌹. సౌందర్య లహరి - 82 / ŚŐÚŃĎĂŔŶĂ ĹĂĤĂŔĨ - 82 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

82 వ శ్లోకము
🌴. నీటి సంబంధ సమస్యల నివారణకు, జల తత్వం మీద విజయం, ఇంద్రుని వంటి శక్తుల కొరకు 🌴

శ్లో: 82. కరీన్ద్రాణాం శుణ్డాన్ కనక కదలీకాణ్డ పటలీ ముఖాభ్యా మూరుభ్యా ముభయమపి నిర్జిత్య భవతీ సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుధకరికుమ్భద్వయమసిll

🌻. తాత్పర్యం :
అమ్మా! శాస్త్రములు అన్నియు తెలిసిన ఓ హిమవంతుని తనయా ! నీవు దిగ్గజములయిన ఏనుగుల తొండములు, బంగారు అరటి బోదెల సముదాయమును , నీ రెండు తొడల చేతను జయించి, భర్త యగు పరమ శివునికి మోకాళ్ళ మీద నమస్కరించుటచే కఠినములు అయిన మోకాళ్ళతో దేవతా గజమయిన ఐరావతము కుంభముల జంటను జయించి ప్రకాశించు చున్నావు కదా !

🌻. జప విధానం - నైవేద్యం:- ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె, ద్రాక్ష పండ్లు నివేదించినచో జల ప్రమాదాల నుండి రక్షణ, జల తత్వం మీద విజయం, ఇంద్రదేవుని వంటి శక్తులు, నీటి సంబంధ సమస్యల నివారణ లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Soundarya Lahari - 82 🌹
📚 Prasad Bharadwaj


SLOKA - 82
🌴 Stopping Flood and Getting Powers like Indhra 🌴

82. Karrendranam sundan kanaka kadhali kaadapatali Umabhamurubhyam - mubhayamapi nirjithya bhavathi Savrithabhyam pathyu pranathikatinabham giri suthe Vidhigne janubhysm vibhudha karikumbha dwayamasi

🌻 Translation :
Oh daughter of the mountain, who knows the rules of the Vedas, using your two thighs, you have achieved victory over, the trunks of the elephant,and the golden pseudo stem of group of banana plants, and achieved victory over frontal globes, of Iravatha the divine elephant, by your holy round knees,which have become hard,by repeated prostrations to your lord.

🌻 Iravatha refers to the elephant on which Indra rides 🌻

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 45 days, offering honey and grape fruit as prasadam, it is believed that to overcome disasters such as flood, hurricane etc.

🌻 BENEFICIAL RESULTS:
Skills to float on or remain and water, ownership of mines and vast wealth.

🌻 Literal Results:
Abundant wealth, great prosperity.
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment

𝐏𝐎𝐖𝐄𝐑 𝐎𝐅 𝐄𝐀𝐂𝐇 𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀 𝐋𝐀𝐇𝐀𝐑𝐈 𝐒𝐇𝐋𝐎𝐊𝐀 - 00

🌹.   𝐏𝐎𝐖𝐄𝐑  𝐎𝐅  𝐄𝐀𝐂𝐇  𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀  𝐋𝐀𝐇𝐀𝐑𝐈  𝐒𝐇𝐋𝐎𝐊𝐀   🌹 📚.  Prasad Bharadwaj 1. Winning in every field 2. Att...