🌹. సౌందర్య లహరి - 71 / Soundarya Lahari - 71 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
71 వ శ్లోకము
🌴. భయాల నుండి విముక్తి, సంపదలు, యక్షిణీ దేవత వశీకరణము 🌴
శ్లో: 71. నఖానా ముద్యోతై ర్నవనళిన రాగం విహసతాం కరాణాం తే కాన్తిం కథయ కథయామః కథముమే కయాచిద్వా సామ్యం భజతు కలయా హస్తకమలం యది క్రీడల్లక్ష్మీ చరణతల లాక్షరసచణమ్ ll
🌷. తాత్పర్యం :
అమ్మా! పార్వతీదేవీ అప్పుడే వికసించిన కమలముల కాంతిని పరిహసించు చున్న నీ హస్తముల కాంతిని ఎట్లు వర్ణింతును? చెప్పుము. కమలములు కమలాలయములు అయిన లక్ష్మీదేవి పాదముల యందలి లత్తుక రసముతో కలసి అరుణిమ కాంతిని పొందిన యెడల కొద్దిగా పోల్చవచ్చునేమో కదా !
జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 12000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె నివేదించినచో భయాల నుండి విముక్తి, సంపదలు, యక్షిణీ దేవత వశీకరణము జరుగును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 71 🌹
📚. Prasad Bharadwaj
SLOKA - 71
🌴 Relief from all fears, purity of life, Getting of Wealth and making slave of Yakshini 🌴
71. Nakhanam uddyotai nava-nalina-ragam vihasatham Karanam te kantim kathaya kathayamah katham Ume; Kayachid va samyam bhajatu kalaya hanta kamalam Yadi kridal-lakshmi-charana-tala-laksha-rasa-chanam.
🌻 Translation :
Oh goddess uma,you only tell us, how,how we can describe,the shining of your hands, by the light of your nails, which tease the redness of freshly opened lotus? perhaps if the red lotus mixes,with the liquid lac adorning,the feet of Lakshmi, some resemblance can be seen.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 12000 times a day for 45 days, offering honey as prasadam, it is believed that they can control Yakshinis (Devatha)
🌻 BENEFICIAL RESULTS:
Relief from all fears, purity of life and control over yakshinis.
🌻 Literal Results:
Beneficial for instrumentalists, sculptors, dancers, designers etc. Purification.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment