Monday, August 31, 2020

సౌందర్య లహరి - 90 / Soundarya Lahari - 90


🌹. సౌందర్య లహరి - 90 / Soundarya Lahari - 90 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

90 వ శ్లోకము
🌴. దుష్ట మంత్ర ప్రభావం, దరిద్రము తొలగుటకు, 🌴

శ్లో: 90. దదానే దీనేభ్యః శ్రియమ నిశమాశాను సదృశీమమన్దం సౌందర్య ప్రకరమకరన్దం వికిరతి తవాస్మిన్ మన్దార స్తబకసుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కరణచరణై ష్షట్చరణతామ్ ll

🌷. తాత్పర్యం :
అమ్మా! భగవతీ! దీనులకు వారి వారి కోర్కెలకు అనుగుణముగా సంపదలు ఇచ్చు అధికమయిన లావణ్యము అను పూదేనెను వెదజల్లుచున్నదియూ, కల్ప కుసుమ పుష్ప గుచ్చము వలే సొగసైనదియు అగు నీ పాద కమలమునందు మనస్సుతో కూడిన జ్ఞానేంద్రియ పంచకము అను ఆరు పాదములు కలవాడనయి తుమ్మెద వలె మునుగుదును గాక !

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 30 రోజులు జపం చేస్తూ, తేనె, పాయసం నివేదించినచో దుష్ట మంత్ర ప్రభావాలు, దరిద్రము తొలగుతాయి అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹


🌹  Soundarya Lahari - 90  🌹
📚. Prasad Bharadwaj

SLOKA - 90
🌴 Cutting of Bad Spells cast, dispel poverty 🌴

90. Dhadhane dinebhyah sriyam anisam asaanusadhrusim Amandham saundharya-prakara-makarandham vikirathi; Tav'asmin mandhara-sthabhaka-subhage yatu charane Nimajjan majjivah karana-charanah sat-charanathaam.

🌻 Translation :
My soul with six organs,is similar to the six legged honey bees,which dip at your holy feet,which are as pretty, as the flower bunch, of the celestial tree,which always grant wealth to the poor, whenever they wish, and which without break showers floral honey.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 30 days, offering payasam and honey as prasadam, one can overcome the effect of bad spells and to dispel poverty

🌻 BENEFICIAL RESULTS:
Removal of charms and enchantments by enemies, dispel poverty.

🌻 Literal Results:
Patronage of high society, gains influence, control of senses.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari

31.Aug.2020

Sunday, August 30, 2020

సౌందర్య లహరి - 89 / ŚŐÚŃĎĂŔŶĂ ĹĂĤĂŔĨ - 89

No photo description available.

🌹.  సౌందర్య లహరి - 89 / ŚŐÚŃĎĂŔŶĂ ĹĂĤĂŔĨ - 89  🌹
📚. ప్రసాద్ భరద్వాజ

89 వ శ్లోకము
🌴. సర్వ వ్యాధుల నివారణకు 🌴

శ్లో: 89. నఖై ర్నాక స్త్రీణాం కరకమల సజ్కోచశశిభి స్తరుణాం దివ్యానాం హసత ఇవ తే చణ్డి చరణౌ ఫలాని స్వస్థ్సేభ్యః కిసలయకరాగ్రేణ దధతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియ మనిశ మహ్నాయ దదతౌ ll

🌷. తాత్పర్యం :
అమ్మా! చండీ అను నామముతో ప్రసిద్ధిగాంచిన నీవు చిగురుటాకుల వంటి చేతులతో స్వర్గలోక వాసులయిన దేవతల కోర్కెలను తీర్చు కల్పవృక్షములను, సర్వలోకముల యందు ఉండు దరిద్రులకు కూడా ఎల్లప్పుడూ సంపదలను ఇచ్చు నీ పాదములు దేవతా స్త్రీల పద్మములవంటి చేతులను ముడుచు కొనునట్లు చేయు గోళ్ళను చంద్రుల చేత పరిహాసము చేయునట్లు ఉన్నవి . కదా!

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 30 రోజులు జపం చేస్తూ, పులగం నివేదించినచో సర్వ వ్యాధులు నుండి నివారణ, కోరిన కోరికలు సిధ్ధించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Soundarya Lahari - 89 🌹
📚. Prasad Bharadwaj

SLOKA - 89
🌴 Getting Rid of all Diseases 🌴

89. Nakhair naka-sthrinam kara-kamala-samkocha sasibhi Tarunam dhivyanam hasata iva te chandi charanau; Phalani svah-sthebhyah kisalaya-karagrena dhadhatam Daridhrebhyo bhadraam sriyam anisam ahnaya dhadhatau.

🌻 Translation :
Your moon like nails, oh mother who killed chanda, which makes the celestial maidens, fold their hands in shame, forever tease your two feet, which unlike the holy trees in heaven, which by their leaf bud like hands, give all they wish to the gods,give the poor people wealth and happiness, always and fast.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 30 days, offering kula (dal) payasam and honey as prasadam, it is believed that they can overcome all diseases in life and wishes fulfilled.

🌻 BENEFICIAL RESULTS:
Cure of all diseases, physical strength.

🌻 Literal Results:
Prayer to Chandi. Great physical strength, materialisation of wishes.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari

30.Aug.2020

Saturday, August 29, 2020

సౌందర్య లహరి - 88 / Soundarya Lahari - 88


🌹. సౌందర్య లహరి - 88 / Soundarya Lahari - 88 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

88 వ శ్లోకము

🌴. పశు ప్రవృత్తులపై అదుపునకు, క్రూర జంతువుల వశ్యత కొరకు 🌴

శ్లో: 88. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమఠీకర్పరతులాం కథం వా పాణిభ్యా ముపయమనకాలే పురభిదా యదాదాయ న్యస్తం దృషది దయామానేన మనసా ll

🌷. తాత్పర్యం :
అమ్మా! పార్వతీ ! కీర్తులకు నెలవయిన ఆపదలను దరి చేర నీయని నీ పాదముల పై భాగమును కవి శ్రేష్ఠులు తాబేలు వీపు చిప్పతో ఎట్లు పోల్చినారు? వివాహ సమయమున దయకలిగిన హృదయము కల ఈశ్వరుడు తన చేతులతో ఎత్తి సన్నికల్లు మీద ఎట్లు ఉంచినాడు?

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 6 నెలలు జపం చేస్తూ, పాయసము, పండ్లు , కొబ్బరికాయ నివేదించినచో స్వీయ పశు ప్రవృత్తులపై అదుపు, క్రూర జంతువుల వశ్యత, సమస్యల మీద అదుపు లభించును అని చెప్పబడింది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹  Soundarya Lahari - 88  🌹
📚. Prasad Bharadwaj

SLOKA - 88
🌴 Making wild Beasts Obey 🌴

88. Padham the kirhtinam prapadham apadham Devi vipadham Katham nitham sadbhih kutina-kamati-karpara-thulam; Katham vaa bahubhyam upayamana-kaale purabhida Yad adhaya nyastham drshadi daya-manena manasa.

🌻 Translation :
Oh, goddess devi,how did the poets compare,the foreside of your merciful feet,which are the source of fame to your devotees,and which are not the source of danger to them,to the hard shell of tortoise,i do not understand. how did he who destroyed the three cities,take them in his hand, and place them on hard rock, during your marriage?

🌻 It denotes a customary rite in Hindu marriage called asmarohanam

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 6 months, offering milk payasam, coconut and fruits as prasadam, it is believed that one can get control over own lower nature, control over troubles and can overcome fear of wild animals and bring them under our control.

🌻 BENEFICIAL RESULTS:
Controlling wild animals, freedom from troubles and prosperity.

🌻 Literal Results:
Great fame, enhances creativity controls brutal force.

🌹 🌹 🌹 🌹 🌹


29 Aug 2020



Friday, August 28, 2020

సౌందర్య లహరి - 87 / 🆂🅾🆄🅽🅳🅰🆁🆈🅰 🅻🅰🅷🅰🆁🅸 - 87


🌹.  సౌందర్య లహరి - 87 / Soundarya Lahari - 87  🌹
📚. ప్రసాద్ భరద్వాజ

87 వ శ్లోకము
🌴. భవిష్యత్తు సూచన, సర్ప భయ నివారణ 🌴

శ్లో: 87. హిమానీ హన్తవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశి చరమభాగే చ విశదౌ

వరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజన్తౌ సమయినాం

సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిమ్ ll

🌷. తాత్పర్యం :
అమ్మా! మంచుపర్వతము నందు నివశించుట యందు మిక్కిలి నేర్పు గల నీ పాదములు రాత్రి యందునూ, తెల్లవారుఝామున యందునూ నిర్మలముగా ప్రకాసించుచూ నీ భక్తులకు లక్ష్మిని ప్రసాదించుచూ, మంచుచే నసించునవియు, అర్ధరాత్రి ముడుచుకుని పోవునవియు లక్ష్మీదేవి కి నివాసము అయిన పద్మములను జయించుచున్నవి కదా. ఇందు వింత ఏమియు లేదు.

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 16 రోజులు జపం చేస్తూ, పాయసము, పండ్లు , కొబ్బరికాయ నివేదించినచో భవిష్యత్తు సూచన, పాముల భయము నుండి నివారణ లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹


🌹  Soundarya Lahari - 87  🌹
📚. Prasad Bharadwaj

SLOKA - 87
🌴 Foresee things and overcome fear of serpents in life 🌴

87. Himani-hanthavyam hima-giri-nivas'aika-chaturau Nisayam nidranam nisi charama-bhaghe cha visadau; Varam laksmi-pathram sriyam ati srijanthau samayinam Sarojam thvad-padau janani jayatas chitram iha kim.

🌻 Translation :
Oh mother mine, the lotus flower rots in snow,but your feet are aces in being in snow,the lotus flower sleeps at night,but your feet are wakeful night and after night,the lotus makes the goddess of wealth lakshmi live in it,but your feet gives lakshmi to its devotees, and so your two feet always wins over the lotus,what is so surprising in this?

(The term wealth is denoted for Lakshmi)

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 16 days, offering milk payasam ,coconut and fruits as prasadam, it is believed that they can overcome fear of serpents in life.

🌻 BENEFICIAL RESULTS:
Power to plan, to foresee things and get vast wealth.

🌻 Literal Results:
Accumulation of riches and jewellery.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari

28 Aug 2020

Thursday, August 27, 2020

సౌందర్య లహరి - 𝟾̷𝟼̷ / 𝚂̷𝚘̷𝚞̷𝚗̷𝚍̷𝚊̷𝚛̷𝚢̷𝚊̷ 𝙻̷𝚊̷𝚑̷𝚊̷𝚛̷𝚒̷ - 𝟾̷𝟼̷


🌹.  సౌందర్య లహరి - 𝟾̷𝟼̷ / 𝚂̷𝚘̷𝚞̷𝚗̷𝚍̷𝚊̷𝚛̷𝚢̷𝚊̷ 𝙻̷𝚊̷𝚑̷𝚊̷𝚛̷𝚒̷ - 𝟾̷𝟼̷  🌹
📚. ప్రసాద్ భరద్వాజ

86 వ శ్లోకము
🌴. దుష్టశక్తుల నుండి రక్షింప బడుటకు, శత్రువుల మీద విజయం 🌴

శ్లో: 86. మృషాకృత్వా గోత్ర స్ఖలన మథ వైలక్ష్య నమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే చిరా దన్త శ్శల్యం దహన కృత మున్మూలితవతా తులాకోటిక్వాణైః కిలికిలి తమీశానరిపుణా ll

🌷. తాత్పర్యం :
అమ్మా! పార్వతీ దేవీ ! పొరపాటుగా నీ భర్త అయిన శివుడు నీ వద్ద గంగ పేరు ఉచ్ఛరించి కలవరపాటున ఏమిచేయవలెనో తోచక నీకు నమస్కారము చేసిననూ భర్తను నీ పాదపద్మముతో తాడనము చేయగా, చిరకాలముగా శత్రువుగా ఉన్న మన్మధుడు నవ్విన నవ్వు నీ కాలి అందెల చప్పుడుగా వెలువడెను, కదా !

🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 21 రోజులు జపం చేస్తూ, పాయసం, అరటి పండు, కొబ్బరికాయ నివేదించినచో దుష్ట శక్తుల నుండి విడుదల, రక్షణ, శత్రు విజయం లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹


🌹  𝚂̷𝚘̷𝚞̷𝚗̷𝚍̷𝚊̷𝚛̷𝚢̷𝚊̷ 𝙻̷𝚊̷𝚑̷𝚊̷𝚛̷𝚒̷ - 𝟾̷𝟼̷  🌹
📚. Prasad Bharadwaj

SLOKA - 86
🌴 Removing Fear of Ghosts and Victory over Enemies 🌴

86. Mrisha krithva gothra skhalana matha vailakshya namitham Lalate bhartharam charana kamala thadayathi thee Chiradantha salyam dhahanakritha -munmilee thavatha Thula koti kkana kilikilith -meesana ripuna

🌻 Translation :
In a playful mood, after teasing you, about you and your family, and at a loss to control your love tiff, when your consort does prostrations, your lotus like feet touches his forehead, and the god of love, the enemy of your lord, who was burnt,by the fire from his third eye, and was keeping the enmity with your lord, like the ever hurting arrowmakes sounds like kili kili, from your belled anklets on the legs.

(kili kili refers to the sound of teasing also sound from anklets)

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 21 days, offering milk payasam, coconut and banana fruit as prasadam, it is believed that they can overcome forms of fearand evil spirit in life and can get victory over enemies

🌻 BENEFICIAL RESULTS:
Subduing enemies, warding off evil spirits, obtaining power and strength.

🌻 Literal Results:
Gaining strength and infrastructure to attack and subdue enemies.
🌹 🌹 🌹 🌹 🌹


27 Aug 2020


Wednesday, August 26, 2020

సౌందర్య లహరి - 85 / Soundarya Lahari - 85


🌹. సౌందర్య లహరి - 85 / Soundarya Lahari - 85 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

85 వ శ్లోకము

🌴 దుష్టశక్తుల నుండి రక్షింపబడుటకు 🌴

శ్లో: 85. నమోవాకం బ్రూమో నయన రమణీయాయ పదయో స్తవాస్మ్యె ద్వన్ధ్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యన్తం యదభిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కజ్కేళితరవే.ll

🌷. తాత్పర్యం :
అమ్మా! నీ పాదముల చేత తాడనమును కోరుచున్న ఉద్యాన వనమందు ఉన్న అశోక వృక్షములను చూచి పశుపతి అయిన ఈశ్వరుడు అసూయను చెందుచున్నాడో, కనులకు ఇంపయిన తడి లత్తుకతో కూడిన నీ పాదముల జంటకు ప్రణామములు.

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 12 రోజులు జపం చేస్తూ, తేనె, పాయసం, నివేదించినచో దుష్ట శక్తుల నుండి రక్షణ లభించును అని చెప్పబడింది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹Soundarya Lahari - 85 🌹
📚 Prasad Bharadwaj

SLOKA - 85

🌴 Removing Fear of Ghosts 🌴

85. Namo vakam broomo nayana ramaneeyaya padayo Thavasmai dwandhaya sphuta ruchi rasalaktha kavathe Asooyathyantham yadhamihananaaya spruhyathe Passonamisana pramadhavana kamkhelitharave

🌻 Translation :
We tell our salutations,to thine two sparkling feet. which are most beautiful to the eyes, and painted by the juice of red cotton. we also know wellthat god of all animals, your consort is very jealous of the asoka trees in the garden, which yearn for kick by your feet.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 12 days, offering honey, milk payasam as prasadam, it is believed that they can overcome forms of fear of ghosts in life.

🌻 BENEFICIAL RESULTS:
Deiverance from hold of evil spirits, attainment of devotion to Devi.

🌻 Literal Results:
Relief from binding situations and people. Ability to bring about quick changes.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundary_lahari

26.Aug.2020

Tuesday, August 25, 2020

సౌందర్య లహరి - 84 / ꇙꄲ꒤ꋊ꒯ꋬꋪꌦꋬ ꒒ꋬꁝꋬꋪ꒐ - 84


🌹. సౌందర్య లహరి - 84 / ꇙꄲ꒤ꋊ꒯ꋬꋪꌦꋬ ꒒ꋬꁝꋬꋪ꒐ - 84 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

84 వ శ్లోకము
🌴. పరకాయ ప్రవేశ శక్తి లభించుటకు 🌴

శ్లో: 84. శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా 
మమాప్యేతౌ మాతశ్శిరసి దయయా ధేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినీ 
యయోర్లాక్షాలక్ష్మీరరుణ హరిచూడామణిరుచిఃll 

🌷. తాత్పర్యం : 
అమ్మా! వేదములయిన నీ శిరస్సునందు ఉపనిషత్తులు సిగలో పూవులుగా ధరింపబడినవో, శివుని జటాజూటము నందలి గంగా జలముతో పాద ప్రక్షాళన కొరకు ఉపయోగించునవియు, విష్ణువు యొక్క కౌస్తుభ మణి కాంతులే లత్తుకగా గల నీ పాదములను నా శిరస్సు నందు దయతో ఉంచుము.

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు ఒక సంవత్సరం జపం చేస్తూ, తేనె, పాయసం, రకరకముల అన్నములు నివేదించినచో విముక్తి, పరకాయ ప్రవేశము చేసే శక్తి లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 


🌹  ꇙꄲ꒤ꋊ꒯ꋬꋪꌦꋬ ꒒ꋬꁝꋬꋪ꒐ - 84  🌹
📚. Prasad Bharadwaj 

SLOKA - 84
🌴 Getting Redemption and Entering into another's Body 🌴

84. Sruthinam murdhano dadhati thava yau sekharathaya Mama'py etau Matah sirasi dayaya dhehi charanau; Yayoh paadhyam paathah Pasupathi-jata-juta-thatini Yayor larksha-lakshmir aruna-Hari-chudamani-ruchih

🌻 Translation : 
Oh mother mine,be pleased to place your two feet,which are the ornaments of the head of Upanishads, the water which washes them are the river ganges, flowing from shiva's head,and the lac paint adorning which, have the red luster of the crown of vishnu, on my head with mercy.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 1 year, offering honey, variety rice and milk payasam as prasadam, one is said to enter other one ‘s body.

🌻 BENEFICIAL RESULTS: 
Power of mesmerism and transmigration into other bodies, ability to cure illness of others. 

🌻 Literal Results: 
Activation of muladhara and swadhishtana chakra. Purification and elevation. 

🌹 🌹 🌹 🌹 🌹


25.Aug.2020

𝐏𝐎𝐖𝐄𝐑 𝐎𝐅 𝐄𝐀𝐂𝐇 𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀 𝐋𝐀𝐇𝐀𝐑𝐈 𝐒𝐇𝐋𝐎𝐊𝐀 - 00

🌹.   𝐏𝐎𝐖𝐄𝐑  𝐎𝐅  𝐄𝐀𝐂𝐇  𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀  𝐋𝐀𝐇𝐀𝐑𝐈  𝐒𝐇𝐋𝐎𝐊𝐀   🌹 📚.  Prasad Bharadwaj 1. Winning in every field 2. Att...