Friday, August 7, 2020

సౌందర్య లహరి - 66 / Soundarya Lahari - 66


🌹. సౌందర్య లహరి - 66 / Soundarya Lahari - 66 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

66 వ శ్లోకము

🌴. సంగీత వాయిద్యాల యందు ప్రావీణ్యత, గాత్ర మధురిమకు, రోగముల నివారణకు 🌴

శ్లో: 66. విషఞ్చ్యా గాయన్తీ వివిధమపదానం పశుపతే స్త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే
త్వదీయైర్మాధుర్యైరపలపిత తన్త్రీకలరవాం నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతమ్ ll

🌻. తాత్పర్యం :
అమ్మా! సరస్వతీదేవి నీ ఎదుట పరమ శివుని విజయగాధలు వీణతో పాడుచు ఉండగా, అప్పుడు నీవు నీ మనస్సునందు కలిగిన సంతోషమును తెలుపుచూ శిరస్సును కదుపుతూ ప్రశంసా వాక్యములు పలుకుట మొదలు పెట్టగానే, ఆ వాక్యములందలి మాధుర్యము నకు, తన యొక్క వీణా తంత్రము కలవరము చెందినదయి తన యొక్క వీణను చీర చెంగుతో కప్పివేసెను .కదా !

🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె, క్షీరాన్నము నివేదించినచో సంగీత వాయిద్యాల యందు ప్రావీణ్యత, గాత్రము యందు మధురిమ, రోగముల నివారణ లభించును అని చెప్పబడింది.

🌹 SOUNDARYA LAHARI - 66 🌹
📚 Prasad Bharadwaj

Sloka - 66 🌹

🌴 Sweet Words and Mastery in Music 🌴

66. Vipanchya gayanthi vividham apadhanam Pasupathea Thvay'arabdhe vakthum chalita-sirasa sadhuvachane; Tadhiyair madhuryair apalapitha-tantri-kala-ravam Nijaam vinam vani nichulayati cholena nibhrutham.

🌻 Translation :
Oh mother of all, when you start nodding your head, muttering sweetly, good, good, to the goddess Saraswathi,when she sings the great stories to you, of Pasupathi our lord, with the accompaniment of her veena,she mutes the veena by the covering cloth, so that the strings throwing sweetest music, are not put to shame, by your voice full of sweetness.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 45 days, offering as milk payasam, honey as prasadam, it is believed that they will be achieve mastery in music and musical instruments and free from diseases

🌻 BENEFICIAL RESULTS:
Cure of minor ailments, gets skill in vocal and instrumental music.

🌻 Literal Results:
The last two verses "Thadeeyairmaadhuryai.....Nibhrutham" are not suitable for veena aspirants. Excellent sloka for vocalists. Also induces sweet speech.

🌹 🌹 🌹 🌹 🌹

Thursday, August 6, 2020

సౌందర్య లహరి - 65 / Soundarya Lahari - 65

🌹. సౌందర్య లహరి - 65 / Soundarya Lahari - 65 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

65 వ శ్లోకము

🌴. సర్వ కార్యములలో జయం కొరకు, వాక్శుద్ధి 🌴

శ్లో: 65. రణే జిత్వాదైత్యానపహృతశిరస్త్రైః కవచిభిర్ని వృత్తైశ్ఛణ్దాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః 
విశాఖేన్ద్రోపేన్ద్రై శ్శశివిశద కర్పూర శకలాః 
విలీయ న్తే మాత స్తవ వదన తామ్బూలకబళాః 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా ! సమరమున రాక్షసులను జయించి వచ్చి తలపాగాలను తొలగించి , కవచములని తొలగించని వారునూ చండుడు అను ప్రమధునిచే అనుభవింపదగిన హర నిర్మాల్యమునందు విముఖులయిన వారునూ అగు కుమారస్వామి, ఇంద్రుడు,విష్ణువు మొదలగువారిచే చంద్రుని వలె స్వచ్ఛమయిన, నిర్మలములు అయిన నీ ముఖమునందలి తాంబూలపు ముద్దలు గ్రహించబడు చున్నవి. కదా ! 

🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె నివేదించినచో సర్వ కార్యములలో జయం, వాక్శుద్ధి లభించును అని చెప్పబడింది.

🌹 SOUNDARYA LAHARI - 65 🌹
📚. Prasad Bharadwaj 

Sloka - 65

🌴  Victory in all worjs and Control over Words 🌴

65. Rane jithva'daithyan apahrutha-sirastraih kavachibhir Nivrittais Chandamsa-Tripurahara-nirmalva-vimukhaih; Visakh'endr'opendraih sasi-visadha-karpura-sakala Viliyanthe maatas tava vadana-tambula-kabalah. 
 
🌻 Translation : 
Oh mother of the world, the lords Subrahmanya, Vishnu and Indra, returning and resting after the war with asuras have removed their head gear, and wearing the iron jackets, are not interested in the left over, after the worship of Shiva ,which belongs to chandikeswara, and are swallowing with zest, the half chewed betel, from your holy mouth, which has the camphor as white as the moon.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 
If one chants this verse 1000 times a day for 45 days, offering honey as prasadam, it is believed that they will be achieve success in all efforts.

🌻 BENEFICIAL RESULTS: 
Success in life, promotes intelligence. 
 
🌻 Literal Results: 
Influence in high circles and among prominent people.
🌹 🌹 🌹 🌹 🌹

Wednesday, August 5, 2020

సౌందర్య లహరి - 64 / Soundarya Lahari - 64


🌹. సౌందర్య లహరి - 64 / Soundarya Lahari - 64 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

64 వ శ్లోకము

🌴. స్త్రీల వ్యాధులు నశింప చేయుటకు, ప్రజ్ఞా వంతులు అగుటకు 🌴

శ్లో: 64. అవిశ్రాంతం పత్యర్గుణ గణకథా మ్రేడనజపా జపా పుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా| 
 యద గ్రాసీనాయాః స్ఫటిక దృషదచ్ఛచ్భవిమయీ 
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా ll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా !  నీ యొక్క నాలుక నుండి నిరంతరమూ జప రూపముగా వచ్చు నీ భర్త అయిన ఆ పరమ శివుని  జపా పుష్పములతో , నీ నాలుక చివరి భాగమున ఉన్న శుద్ధ స్ఫటిక రంగు కలిగిన  సరస్వతీదేవి కూడా ఎఱ్ఱని వన్నె కలదై ప్రకాశించు చున్నది. కదా ! 

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 2000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ,  క్షీరాన్నము, తేనె,  నివేదించినచో స్త్రీల వ్యాధులు నశింప చేయునని, ప్రజ్ఞ లభించును అని చెప్పబడింది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 SOUNDARYA LAHARI - 64 🌹
📚. Prasad Bharadwaj 

Sloka - 64 

🌴 Curing diseases for women and attaining wisdom 🌴

64. Avishrantam pathyur guna-gana-katha'mridana-japa Japa-pushpasc-chaya thava janani jihva jayathi saa; Yad-agrasinayah sphatika-drishad-acchac-chavi mayi Sarasvathya murthih parinamati manikya-vapusha. 
 
🌻 Translation : 
Mother mine, the well known tongue of yours, which without rest chants and repeats, the many goods of your consort, Shiva,is red like the hibiscus flower the goddess of learning Saraswathi, sitting at the tip of your tongue, though white and sparkling like a crystal, turns red like the ruby, because of the color of your tongue.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : 
If one chants this verse 2000 times a day for 45 days, offering Payasam, honey as prasadam, it is believed that they will be achieve wisdom and cures all disorders for feminine gender.

🌻 BENEFICIAL RESULTS: 
In case of women, following are the beneficial results: diseases are cured, attainment of power to entice men, ability to pacify angry husband. 
 
🌻 Literal Results: 
Irresisitible speech for women folk, capacity to attract men.
🌹 🌹 🌹 🌹 🌹

Tuesday, August 4, 2020

సౌందర్య లహరి - 63 / Soundarya Lahari - 63


🌹. సౌందర్య లహరి -  63 / Soundarya Lahari  - 63 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ఉన్నత అధికారం, మోక్షము కొరకు 🌴

శ్లో:63. స్మితజ్యోత్స్నా జాలం  తవ వదన చంద్రస్య పిబతాం 
చకోరాణామాసీ దతి  రసతయా చంచుజడిమా l 
అతస్తే శీతాంశో రమృత లహరీ రామ్లరుచియః 
పిబంతి స్వచ్ఛన్డం  నిశినిశి భృశం కాంజికధియా ll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా! భగవతీ , నీ చంద్ర బింబము వంటి ముఖమున గల చిరునవ్వు అను వెన్నెలను త్రాగుచున్న చకోరపక్షుల ముక్కులకు అతి మాధుర్యము వలన అరుచి కలిగి, అవి పులుపునందు కోరిక కలిగి చంద్రుని యొక్క అమృత ప్రవాహమును బియ్యపు కడుగు అనుకొని ప్రతి రాత్రియు వెన్నెల యందు తృప్తిగా త్రాగుచున్నవి కదా! 

🌻. జప విధానం - నైవేద్యం :--
ఈ శ్లోకమును 30000 సార్లు ప్రతి రోజు 30 రోజులు జపం చేస్తూ,  పెరుగు అన్నం, తేనె, పండ్లు, కొబ్బరికాయను నివేదించినచో అందరి మీద స్వామిత్వము, అధికారిత్వము, మోక్షమునకు దారి లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 SOUNDARYA LAHARI - 63 🌹 
📚. Prasad Bharadwaj 

Sloka - 63 

🌴 Gaining Power over others and gives waybto Moksha 🌴

63. Smitha-jyothsna-jalam thava vadana-chandrasya pibatham Chakoranam asid athi-rasataya chanchu-jadima; Athas the sithamsor amrtha-laharim amla-ruchayah Pibanthi svacchhandam nisi nisi bhrusam kaanjika-dhiya. 
 
🌻 Translation : 
The Chakora birds, Feel that their tongues have been numbed, by forever drinking, The sweet nectar like light emanating, from your moon like face, and for a change wanted to taste, The sour rice gruel during the night, and have started drinking, The white rays of the full moon in the sky.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : 
If one chants this verse 30000 times a day for 30 days, offering curd rice honey,fruits and coconut as prasadam, they  are said to create an good impression in others and gives way to moksha

🌻 BENEFICIAL RESULTS: Commanding power, gives moksha.
 
🌻. Literal Results:  
Bestows magnetic and attractive face and personality.
🌹 🌹 🌹 🌹 🌹

Monday, August 3, 2020

🌹. సౌందర్య లహరి - 62 / Soundarya Lahari - 62 🌹

*🌹. సౌందర్య లహరి - 62 / Soundarya Lahari - 62 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

62 వ శ్లోకము

*🌴. సుఖ నిద్ర కొరకు 🌴*

శ్లో: 62. ప్రకృత్యా రక్తాయా స్తవ సుదతి దంతచ్ఛదరుచేః ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విదృమలతా l 
నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం తులా మధ్యారోఢుం కథమివ విలజ్జేత కలయా ll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా ! చక్కని పలువరుసలు కలిగిన తల్లీ ! స్వభావము చేత కాంతులు చిమ్ముతున్న నీ పెదవుల కాంతికి సారూప్యముగా ఈ ప్రపంచమున ఏమియూ లేదు, నీ పై పెదవి సహజమయిన కాంతి కలది, అట్టి కాంతికి సమానముగా "పగడము" తీగకు పండినచో పోలిక కాగలదు.పోల్చుదమన్నదానికి దొండపండును పెదవుల కాంతి సహజము కాదు, దొందపండును బింబమని పలికెదరు, అది కూడా నీ పెదవుల యొక్క ప్రతిబింబము వలననే ఆ పేరు వచ్చెను. కదా ! 

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 8 రోజులు జపం చేస్తూ, తీపి గారెలు, తేనె నివేదించినచో అమ్మ దీవెనల ద్వారా సుఖ నిద్ర లభించును అని చెప్పబడింది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 SOUNDARYA LAHARI - 62 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 62

*🌴 Good Sleep 🌴*

62. Prakrithya'rakthayas thava sudhati dantha-cchada-ruchaih Pravakshye saadrisyam janayathu phalam vidhruma-latha; Na bimbam tad-bimba-prathiphalana-raagad arunitham Thulam adhya'rodhum katham iva bhilajjetha kalaya. 
 
🌻 Translation : 
Oh goddess who has beautiful rows of teeth tried to find a simile to your blood red lips, and can only imagine the fruit of the coral vine. The fruits of the red cucurbit, hang its head in shame, on being compared to your lips, as it has tried to imitate its color from you, and know that it has failed miserably.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 
If one chants this verse 1000 times a day for 8 days, offering sweet vada as prasadam, and Honey it is believed that they will be blessed by the lord to have a peaceful sleep.

🌻 BENEFICIAL RESULTS: 
Sound sleep for the sleepless, robust constitution and power of enticing people. 
 
🌻 Literal Results: 
Healthy constitution, contentment and tranquility.
🌹 🌹 🌹 🌹 🌹

Sunday, August 2, 2020

🌹. సౌందర్య లహరి - 61 / Soundarya Lahari - 61 🌹

*🌹. సౌందర్య లహరి - 61 / Soundarya Lahari - 61 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

61 వ శ్లోకము

*🌴. అమ్మ దీవెనలతో మనో నియంత్రణ, కోరికలు తీరుట కొరకు, కుండలినీ జాగృతి 🌴*

శ్లో: 61. అసౌ నాసా వంశ - స్తుహినగిరి వంశధ్వజపటి 
త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాక ముచితమ్ l 
వహత్యంతర్ముక్తాః శ్శిశిరకర నిశ్వాస గళితం 
సమృద్ధ్యా య స్తాసాం బహిరపి చ ముక్తామణిధరః ll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా! తుహినగిరి రాజ పుత్రీ అయిన ఓ పార్వతీ దేవీ నీ యొక్క వెదురు వలె ఉన్న నాసా దండము మాకు కోరిన కోరికలను తీర్చుచున్నది,ఆ నాసా దండము లోపల మణులను ధరించు చున్నది.ఆ మణుల నిండు దనముచే చంద్రునిదగు ఎడమ ముక్కు ద్వారా వచ్చు గాలి వలన బయట కూడా ముక్తా మణిని ధరించెను కదా ! 

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 12000 సార్లు ప్రతి రోజు 8 రోజులు జపం చేస్తూ, కొబ్బరికాయ, పళ్లు, తేనె నివేదించినచో అమ్మ దీవెనల ద్వారా సకల కోరికలు నెరవేరును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 SOUNDARYA LAHARI - 61 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 61 

*🌴 Victory over Mind and Getting of Wealth and activates kundalini 🌴*

61. Asau naasa-vamsas tuhina-girivamsa-dhvajapati Thvadhiyo nedhiyah phalatu phalam asmakam uchitam; Vahathy anthar muktah sisira-kara-nisvasa galitham Samruddhya yat tasam bahir api cha mukta-mani-dharah 
 
 🌻 Translation :
Oh goddess, who is the flag of the clan of Himalayas, let your nose which is like a thin bamboo, give us the blessings which are apt and near feel mother that you are wearing a rare pearl, brought out by your breath, through your left nostril, for your nose is a storehouse, of rarest pearls divine.

Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 
If one chants this verse 12000 times a day for 8 days, offering pongal, honey, fruits and coconut as prasadam, it is believed that they will be achieve success in all efforts and blessed with all wealth and Activates kundalini.

🌻 BENEFICIAL RESULTS: 
Success in all endeavours of trade, speculation etc., power to fascinate man and conquer the mind. 
 
🌻 Literal Results: 
Eradicates the tendencies of previous births and activates kundalini.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. సౌందర్య లహరి - 60 / Soundarya Lahari - 60 🌹

🌹. సౌందర్య లహరి - 60 / Soundarya Lahari - 60 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

60 వ శ్లోకము

*🌴. అమ్మ దీవెనలతో దైవీ జ్ఞానము, వాక్శుద్ధి 🌴*

శ్లో:60. సరస్వత్యాః సూక్తి రమృతలహరీ కౌశల హరీః పిబన్త్యా శ్శర్వాణీ శ్రవణచుళుకాభ్యా మవిరళంl 
చమత్కార శ్లాఘా చలిత శిరసః కుండల గణో ఝణత్కారైస్తారైః ప్రతివచన మాచష్ట ఇవ తే.ll 
 
🌷. తాత్పర్యం : 
అమ్మా! పరమ శివుని పత్ని అయిన ఓ పార్వతీ దేవీ అమృత ప్రవాహముల మాదుర్యములను హరించు మధురమయిన పలుకులతో సరస్వతీదేవి చేయు స్తోత్రములను చెవులనెడు పుడిసిళ్ళ చేత చక్కగా వినుచూ , ఆ స్తోత్రముల లోని చమత్కారములను మెచ్చుకొనుటకు శిరస్సును కదల్చగా నీ యొక్క కర్ణాభరణములు ఝణత్కారములచే మారు మాటను చెప్పు చున్నట్లు ఉన్నది కదా 

🌷. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పాయాసం, తేనె నివేదించినచో అమ్మ దీవెనల ద్వారా దైవీ జ్ఞానము, వాక్శుద్ధి కలుగును అని చెప్పబడింది.

*🌹 SOUNDARYA LAHARI - 60 🌹* 
📚. Prasad Bharadwaj 

SLOKA - 60 

*🌴 Divine knowledge and Making your Predictions Come True 🌴*

60. Sarasvatyah sukthir amrutha-lahari-kaushala-harih Pibanthyah Sarvani Sravana-chuluk abhyam aviralam; Chamathkara-slagha-chalita-sirasah kundala-gano Jhanatkarais taraih prati-vachanam achashta iva te. 
 
Translation : 
Oh goddess, who is the consort of lord Shiva, your sweet voice which resembles, the continuous waves of nectar ,fills the ear vessels of Saraswathi, without break, and she shakes her head hither and thither, and the sound made by her ear studs, appear as if they applaud your words.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 
If one chants this verse 1000 times a day for 45 days, offering milk payasam and honey as prasadam, it is believed that they will be blesses with divine knowledge and the power to bring their utterances true.

🌻 BENEFICIAL RESULTS: 
Great knowledge, skill in fine arts, eloquence, removes dumbness, provides power of foretelling future events. 
 
🌻 Literal Results: 
Magnetic speech.Great intellect, useful for debates, lawyers, politicians and orators.
🌹 🌹 🌹 🌹 🌹

𝐏𝐎𝐖𝐄𝐑 𝐎𝐅 𝐄𝐀𝐂𝐇 𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀 𝐋𝐀𝐇𝐀𝐑𝐈 𝐒𝐇𝐋𝐎𝐊𝐀 - 00

🌹.   𝐏𝐎𝐖𝐄𝐑  𝐎𝐅  𝐄𝐀𝐂𝐇  𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀  𝐋𝐀𝐇𝐀𝐑𝐈  𝐒𝐇𝐋𝐎𝐊𝐀   🌹 📚.  Prasad Bharadwaj 1. Winning in every field 2. Att...